Salaar: సలార్ లో ప్రభాస్ ఎన్ని డైలాగులు చెప్పారో తెలుసా?

సలార్ సినిమా గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మా డార్లింగ్ ఇలా కనిపించారంటూ కొనియాడుతున్నారు.

Written By: Suresh, Updated On : December 28, 2023 2:52 pm

Salaar

Follow us on

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో దేశం మొత్తం ఈయన ఫ్యాన్స్ అయిపోయారు. ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించిన ఈ స్టార్ హీరో రీసెంట్ గా ఫ్లాప్ లను సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. దీంతో సలార్ సినిమాపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కు సూపర్ హిట్ ను అందించింది. అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు సాధించి మరోసారి ప్రభాస్ సత్తా చాటింది సినిమా.

సలార్ సినిమా గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మా డార్లింగ్ ఇలా కనిపించారంటూ కొనియాడుతున్నారు. ఇక ప్రభాస్ అంటే డైలాగులు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాలో ఒక్కో రేంజ్ లో ఉంటాయి. అలాంటి ప్రభాస్ కు సలార్ సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోవడంతో అభిమానులు కొంచెం నిరాశ చెందుతున్నారు. సలార్ సినిమాలో మొదటి హాప్ మొత్తం ఎక్కడ చూసినా పవర్ ఫుల్ డైలాగ్స్ లేవు.

సెకండ్ హాఫ్ లో కొన్ని డైలాగ్స్ ఉన్నా కూడా చాలా సింపుల్ డైలాగ్స్ ఉన్నాయి. పగిలిందా, సారీ, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, రెండు నిమిషాల్లో దొరలా తయారు చేస్తా, వాళ్లను గర్ల్ ప్రెండ్స్ అంటారు వంటి డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. మొత్తం మీద సలార్ సినిమాలో 38 డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ప్రభాస్ కెరీర్ లోనే చాలా తక్కువ డైలాగ్స్ ఉన్న సినిమా సలార్. అయినా ప్రభాస్ కటౌట్ అదిరిపోయింది. అలాంటప్పుడు డైలాగ్స్ తో పని ఏంటి? డైలాగ్స్ లేకుండా భారీ హిట్ ను సంపాదించింది సలార్.. ఇది మా ప్రభాస్ అన్న రేంజ్ అంటూ ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేస్తున్నారు.