
RRRR Team On Bicycle: సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ విడుదలై ఏడాది పూర్తయ్యింది. 2022 మార్చి 25న ఆ ఆర్ ఆర్ గ్రాండ్ గా విడుదలైంది. ఇంకా ఆర్ ఆర్ ఆర్ మూవీ గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఆస్కార్ గెలుచుకోవడంతో ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఖండాంతరాలకు నాటు నాటు సాంగ్, ఆర్ ఆర్ ఆర్ మూవీ కీర్తి పాకింది. కొరియన్, జర్మన్ అంబాసడర్స్, స్టాఫ్ ఈ సాంగ్ కి డాన్స్ చేస్తూ వీడియోలు రూపొందించారు.
ఏకంగా పదికి పైగా అంతర్జాతీయ అవార్డులు ఆర్ ఆర్ ఆర్ గెలుచుకుంది. అందులో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఉంది. ఓకే ఏడాది తెలుగు సినిమా గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి ప్రఖ్యాత అవార్డులు సొంతం చేసుకుంది. జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల వర్షం కురిపించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. రజినీకాంత్ ముత్తు పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి ఆర్ ఆర్ ఆర్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
దర్శకుడు రాజమౌళి ఫేమ్ మరో స్థాయికి తీసుకెళ్లింది ఆర్ ఆర్ ఆర్. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ హీరోలుగా మలిచింది. ఇప్పుడు హాలీవుడ్ ప్రముఖులకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటే తెలుసు. వారితో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సాధించిన విజయాలు, చేరుకున్న మైలురాళ్ల గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది.

ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదలై ఏడాది అవుతున్న సందర్భంగా టీమ్ ఓ స్పెషల్ ఫోటో విడుదల చేశారు. సదరు ఫోటోలో ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ సైకిల్ రైడ్ చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు భీమ్, రామరాజు గెటప్స్ లో ఉన్నారు. ఇది ఆర్ ఆర్ ఆర్ మూవీ సెట్స్ లో తీసిన ఫోటో. ఇంకా చెప్పాలంటే క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తీశారు. రామ్ చరణ్ పతాక సన్నివేశాల్లో కాషాయం కట్టి రాముడు గెటప్ లో అలరిస్తారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ అరుదైన ఫోటో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
The RRRIDE…. 🖤🤍🧡 #RRRMovie pic.twitter.com/owGiUJP353
— RRR Movie (@RRRMovie) March 25, 2023