
Manchu Family Trolling ‘తిరుపతి వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుంది. వేంకటేశ్వరస్వామి మా పెదనాన్నలాగా అన్పిస్తాడు.’ ఇదీ మంచు లక్ష్మి అప్పట్లో చేసిన వ్యాఖ్య. ‘నాతో మాట్లాడని నిర్మాత అంటూ లేడు. వందల కోట్లు పెడతానికి చాలా మంది రెడీగా ఉన్నారు.’ ఇదీ ఆ మధ్య మంచు విష్ణు నోటి నుంచి జాలువారిన ఆణిముత్యం. కందుకూరి వీరేహలింగం పంతులు అనే గుళిక పై దాని తర్వాత వచ్చింది. మాటల్లో, చేతలు ఇలా అన్నీ ట్రోలింగ్ చేసేలా ఉంటాయి. కానీ ఏమీ అనకూడదు. అంటే గింటే ఆ మంచు విష్ణు ఊరుకోడు. కేసులు పెట్టేస్తాడు. ఇప్పటికే చాలా యూ ట్యూబ్ చానెల్స్ మీద కేసులు పెట్టాడు. ఒక్కొక్కడికి మడత పడిపోతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక మోహన్‌బాబు గురించి చెప్పాలంటే అదో రకమైన మేనరిజం. ఆయన ధీరోదాత్తమైన సన్నాఫ్ ఇండియా గురించి ఏ స్థాయిలో చెప్పాడో మనం చూశాం. ఏ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయో మనం కన్నాం. దీని గురించి ఒక విలేకరి మాట్లాడితే దాదాపు కొట్టినంత పని చేశాడు మోహన్‌బాబు. ఆ మంచు ఫ్యామిలీలో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ వ్యక్తి ఉన్నాడు అంటే మనోజే.. కానీ ఈ మధ్య అతడు రెండో పెళ్లి చేసుకోవడం, అందులో మంచు ఫ్యామిటీ అంటి ముట్టనట్టు ఉండటంతో ఏదో జరుగుతోంది అనే సంకేతం కన్పించింది.
ఆ సంకేతం కాస్త బద్దలయింది. మనోజ్, విష్ణు మఽధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇక ఈ వ్యవహారంలో సారథి అనే వ్యక్తిని విష్ణు కొట్టాడు.దీనిని మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ట్రోలర్లు పండగ చేసుకుంటున్నారు. అసలే మంచు ఫ్యామిటీ అంటే అంతెత్తున లేచే ట్రోలర్లు ఈ ఎపిసోడ్‌తో రెచ్చిపోతున్నారు. గతంలో మంచు విష్ణు, మోహన్‌బాబు మాట్లాడిన వీడియోలను యాడ్ చేసి రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలే ట్రెండింగ్‌గా ఉన్నాయి. మొన్నటి దాకా కవిత లిక్కర్ స్కాం మీద ట్రోల్ వీడియోలు చేసిన విసిగెత్తిన వారికి.. మంచు ఫ్యామిలీ గొడవ సరికొత్త బూస్ట్ ఇచ్చింది. అదేంటో గానీ మంచు ఫ్యామిటీ అంటేనే ట్రోలర్లు రెచ్చిపోతారు. దానికి మరింత మసాలా యాడ్ చేస్తారు.

మంచు మనోజ్ వీడియో డిలీట్ చేసినంత మాత్రాన.. జరగాల్సిన నష్టం జరిగింది. అప్పటికే వీడియోను భద్రపరచుకున్న మీమర్లు ఇక చెడుగుడు ఆడుతున్నారు. వాస్తవానికి కొంతకాలంగా మనోజ్, విష్ణు మధ్య టర్మ్స్ బాగోలేవు. మనోజ్ పెళ్లికి కూడా విష్ణు రాలేదు. విష్ణు ‘మా’ ఎన్నికల్లో గెలిచినప్పటికీ మనోజ్ సందడి అంతంతమాత్రంగానే ఉంది. అప్పట్లోనే ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే అనుమానాలు విన్పించాయి. ఈ సంఘటనతో ఇప్పుడు నిజమైంది. ఇక విష్ణు చేతిలో దెబ్బలు తిన్న సారథి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంచు కుటుంబం ట్రోలర్స్ చేతిలో పడి నవ్వులపాలవుతోంది. ఇప్పుడు ఈ ట్రోలర్స్ మీద మన కందకూరి వీరేశం పేకాశం పంతులు కేసులు ఏమైనా పెడతాడా? పోనీ గూగుల్ బాధ్యులకు ఏమైనా ఫిర్యాదు చేస్తాడా? లేక సారథిని కొట్టినట్టు ఒక్కొక్కన్ని ఇంటికి వచ్చి కొడతాడా?
https://www.youtube.com/watch?v=_63ac_UXCP8&t=92s