
Mohan Babu – Chiranjeevi : జిన్నా సినిమా ప్లాప్. కనీసం కోటి రూపాయల షేర్ రాలేదు. అయితే ఈ చిత్రంలోని జారు మిఠాయి సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించింది. ఈ సాంగ్ శ్రీకాకుళంకి చెందిన భారతమ్మ పాడారు. జిన్నా ప్రీ రిలీజ్ వేదికలో ఇద్దరు పల్లెటూరి లేడీ సింగర్స్ జానపదాలు పర్ఫార్మ్ చేయడం జరిగింది. మోహన్ బాబు జారు మిఠాయి సాంగ్ పాడిన భారతమ్మతో పాటు పక్కన ఉన్న మహిళకు సన్మానం చేసి, వారికి కొంత పారితోషికం అందించారు. ఈ పల్లెటూరి సాంగ్ సినిమాలో సక్సెస్ అవుతుంద్న మోహన్ బాబు ఆలోచన నిజమైంది. భారీ ఆదరణ దక్కించుకుంది.
ఈ సాంగ్ సక్సెస్ మీద తాజా ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈశ్వర్ రెడ్డి అనే దర్శకుడిని నేను పల్లెటూరి సాంగ్స్ కావాలని చెబితే ఇద్దరు మహిళలను ఆయన గుర్తించి తీసుకొచ్చారు. అలా జారు మిఠాయి సాంగ్ వెలుగులోకి వచ్చింది. జారు మిఠాయి సాంగ్ సక్సెస్ అవుతుందని ముందే ఊహించాను.
జిన్నా సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. అది మంచి సినిమా విష్ణు, సన్నీ లియోన్ అద్భుతంగా చేశారు. అయితే ఓటీటీలో బాగా ఆదరణ దక్కింది. ప్రతి ఒక్కరి నోట జారు మిఠాయి సాంగ్ వినిపిస్తుందన్నారు. యాంకర్ కల్పించుకుంటూ… చిరంజీవి కూడా జారు మిఠాయి సాంగ్ వాల్తేరు వీరయ్య మూవీలో పాడారు, అన్నారు. దానికి మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. అవును ఆ సినిమా నేను కూడా చూశాను. జిన్నా విష్ణు నటించిన మూవీ అని తెలుసు… అయినా చిరంజీవి పాడారు.
నా మీద, నా బిడ్డ మీద ప్రేమ ఉండబట్టే కదా పాడారు. దీన్ని బట్టి చెప్పొచ్చు కదా చిరంజీవికి నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవని. మంచి సాన్నిహిత్యం ఉందని. కొందరు మూర్ఖులకు ఇది తెలియదు. దాని వలన వాళ్లే నష్టపోతారు కానీ మేము కాదని అన్నారు. చిరంజీవితో నాకు గొడవలు లేవు. మా మధ్య చక్కని అనుబంధం ఉందని మోహన్ బాబు చెప్పారు. ఆ మధ్య చిరంజీవి-మోహన్ బాబు చాలా సన్నిహితంగా మెలిగారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇద్దరు మధ్య గొడవలకు కారణమయ్యాయి.