Delhi: విలాసవంతమైన జీవితం గడపాలి. చెమట చుక్క చిందకుండా ఖరీదైన వస్తువులను సొంతం చేసుకోవాలి. రాజ భోగాలను అనుభవించాలి. ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేయాలి. విలాసవంతమైన స్పా లలో సేద తీరాలి. ఆడి లాంటి కార్లలో చక్కర్లు కొట్టాలి. ఇవన్నీ జరగాలంటే డబ్బు కావాలి. లేదా అంబానీ లేదా అదానీ కడుపులో పుట్టాలి. కష్టపడేందుకు ఎలాగూ వళ్ళు వంగదు. పోనీ ఉద్యోగం చేద్దామంటే చేతిలో డిగ్రీ లేదు. అసలు పొట్ట చీరితే అక్షరం ముక్క రాదు. ఇలాంటప్పుడు మనిషిలో మరో కోణం బయటపడుతుంది. అది డబ్బు కోసం ఎంతకైనా తెగించే ప్రయత్నం చేస్తుంది. సరిగా ఇలాంటి ఘటనే ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీ మహానగరంలోని శివారు ప్రాంతంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ రోజువారి భారీగా లావాదేవీలు జరుగుతుంటాయి.. పంజాబ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం కావడంతో ట్రక్ డ్రైవర్లు ఎక్కువగా ఇక్కడ ఇంధనం ఉంటారు కొట్టించుకుంటారు. వీరు మాత్రమే కాకుండా రైతుల కూడా తన వాహనాలకు ఈ పెట్రోల్ బంకులో ఇంధనాన్ని ఎక్కువగా వాడుతుంటారు. రోజువారి లావాదేవీలు లక్షల్లో సాగుతుండటంతో కొంతమంది దోపిడి దొంగల కన్ను ఈ బంకు మీద పడింది. ఇంకేముంది జులాయి సినిమాలో సీన్ ను అమల్లో పెట్టారు.
కొంతమంది దోపిడీ దొంగలు ద్విచక్ర వాహనాల మీద ముసుగులు ధరించి ఈ బంకులోకి వచ్చారు. బండిలో పెట్రోల్ పోయమని సిబ్బందిని ఆదేశించారు. వారు పెట్రోల్ పోస్తుండగా చేతిలో ఉన్న తుపాకీతో బెదిరించారు. మిగతా వ్యక్తులు పెట్రోల్ బంక్ సిబ్బంది భుజంపై ఉన్న క్యాష్ బ్యాగును తస్కరించారు. కొంతమంది తుపాకులతో బెదిరిస్తుండగానే.. మిగతావారు బండ్లను మూవ్ చేశారు. ఇలా వీరు తుపాకులతో బెదిరిస్తూ బండ్ల మీద పారిపోయారు. సుమారు పది లక్షల దాకా నగదును దోపిడి దొంగలు తస్కరించాలని సమాచారం.. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా లిప్త పాటు కాలంలో దోపిడి దొంగలు నగదును తస్కరించడం సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ మహానగరంలోని పెట్రోల్ బంక్ యజమాన్యాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. కాగా ఈ సంఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram