Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఐదో వారం మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. టాస్క్ గెలిచి ఇంటి ఫస్ట్ కెప్టెన్ గా నిలిచాడు మన రైతు బిడ్డ ప్రశాంత్. తనకి ఏమి రాదు,సింపతీ గేమ్ ఆడుతున్నాడు అని అన్న వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాడు. తన సత్తా ఏంటో చూపించాడు.కెప్టెన్ ఐతే అయ్యాడు కానీ ,కెప్టెన్ చేయాల్సిన పనులు ఏ మాత్రం చేయలేదు. ఇంటి బాధ్యతలు,కిచెన్ , రేషన్ మేనేజ్మెంట్ లాంటి వాటి గురించి పట్టించుకోలేదు ప్రశాంత్.
ఇదంతా గమనించిన బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్లో ప్రశాంత్ ని కెప్టెన్ కి ఉండవలసిన లక్షణాలు,బాధ్యతల గురించి చెప్పమని అడిగాడు. హౌస్ మేట్స్ అందరితో కెప్టెన్ అంటే ఎలా ఉండాలో చెప్పించాడు. కెప్టెన్ అంటే కమాండింగ్ గా ఉండాలి,అందరితో పనులు చేయించాలి, తప్పు చేసిన వారికి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ గుడ్ కెప్టెన్ అనుకునే వాళ్ళు చేతులెత్తమంటే మెజారిటీ ఎత్తారు. కానీ ప్రశాంత్ తన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదని కెప్టెన్సీ రద్దు చేశారు బిగ్ బాస్.
కెప్టెన్సీ బ్యాడ్జ్ తిరిగి తీసుకున్నాడు. ఇలా జరగడంతో ప్రశాంత్ చాలా బాధ పడ్డాడు. కెప్టెన్సీ పోయినా కూడా నువ్వే మా కెప్టెన్ వి అంటూ కాస్త ధైర్యం చెప్పారు హౌస్ మేట్స్. ఇది ఇలా ఉండగా ఇంత కథ నడిపి,ప్రశాంత్ గుక్కపెట్టి ఏడ్చేలా చేసిన బిగ్ బాస్ మళ్ళీ కెప్టెన్సీ తిరిగి ఇచ్చేసాడు. ప్రశాంత్ తన తప్పు తెలుసుకోవాలనే ఇలా చేసాడంట బిగ్ బాస్. ఇక కెప్టెన్సీ బాధ్యతలు మళ్ళీ అప్పజెప్పాడు. ఇకనైనా ప్రశాంత్ సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తాడో లేదో చూడాలి.
ఇక ఈ వారం నామినేషన్స్ పరిశీలిస్తే… అమర్ దీప్, ప్రిన్స్ యావర్, తేజా, శోభా శెట్టి, నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీ ఉన్నారు. వీరిలో ఓటింగులో యావర్ ఉన్నాడని సమాచారం. అనూహ్యంగా శోభా శెట్టి డేంజర్ జోన్లో ఉన్నదట. ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఇంటిని వీడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.