https://oktelugu.com/

Lemon: ఒక్క నిమ్మకాయ ధర రూ.35 వేలు.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?

నిజానికి ఒక్క నిమ్మకాయ ధర అంత ఉండదు. అయితే ఇక్కడ నియమ్మకాయను వేలం వేస్తే రూ.35 వేలు పలికింది. చెన్నైలోని ఈరోడ్‌ జిల్లా శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో ఈ వేలం నిర్వహించారు. అందులో నిమ్మకాయ ధర రూ.35 వేలు పలికింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 11, 2024 / 09:09 AM IST

    Lemon

    Follow us on

    Lemon: శీర్షిక చూడగానే షాక్‌ అవుతున్నారా.. అచ్చు తప్పు పడిందని భావిస్తున్నారా.. అయితే మీరే తప్పులో కాలేసినట్లు. ఎందుకంటే మీరు చదివిన శీర్షిక సరైనదే. ఒక్క నిమ్మకాయ ధర అక్షరాలా రూ.35 వేలు పలికింది. ఇంత ధర పలికిందంటే దానికి ఏమైన ప్రత్యేకతలు ఉన్నాయని అనుకుంటున్నారా. కానీ అలాంటిదేమీ లేదు. అవన్నీ సాధారణ నియమ్మకాయలే. వేసవిలో నిమ్మకాయల ధరలు పెరుగుతాయని తెలుసు. అయితే పదో, పాతికో అవుతుంది. కానీ, ఒక్కసారిగా ఇలా వేలళ్ల పెరగడంపై చర్చ జరుగుతోంది.

    ధర ఎలా పెరిగిందంటే..
    నిజానికి ఒక్క నిమ్మకాయ ధర అంత ఉండదు. అయితే ఇక్కడ నియమ్మకాయను వేలం వేస్తే రూ.35 వేలు పలికింది. చెన్నైలోని ఈరోడ్‌ జిల్లా శివగిరి గ్రామ సమీపంలోని పాతపూసయ్య ఆలయంలో ఈ వేలం నిర్వహించారు. అందులో నిమ్మకాయ ధర రూ.35 వేలు పలికింది.

    ప్రత్యేకత ఇదీ..
    అయితే వేలంలో కూడా అంత ధర చెల్లిచండానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు. కారణం ఏమిటంటే మహా శివరాత్రి సందర్భంగా స్వామివారికి నిమ్మకాయలు, పండ్లతో రెండు రోజులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం పూజలందుకున్న పండ్లను వేలం వేస్తారు. ఈసారి నిర్వహించిన వేలంలో 15 వేల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.

    దక్కించుకున్న ఇండోర్‌ వాసి..
    వేలంలో నిమ్మకాయను ఇండోర్‌కు చెందిన భక్తుడు ఈ నిమ్మకాయను రూ.35 వేలకు దక్కించుకున్నాడు. దీంతో వేలం వేసిన నిమ్మకాయను ఆలయ పీఠాధిపతి ముందు ఉంచి పూజ చేసి దక్కించుకున్న వ్యక్తికి అందించారు. అయితే ఒక్క నిమ్మకాయకులు ఇండోర్‌వాసి ఇంత ధర చల్లించడంపై ఆసక్తికర చర్చ జరగుతోంది.

    ధనవంతులవుతారని..
    దేవుడి పూజలు అందుకున్న పదార్థాలను దక్కించుకుంటే ధన వంతులు అవుతారని, ఆయురారోగ్యాలు దరి చేరవని పేర్కొంటున్నారు. అందుకే వేలంలో భక్తులు భారీగా పాల్గొని పూజ నిర్వహించిన వస్తువులు కొనుగోలు చేశారు. ఇలా నిమ్మకాయకు రూ.35 వేల పలికింది.