Mamata Banerjee: అలాంటి మహిళకు టికెట్ ఇచ్చి.. మమతా బెనర్జీ ఏం సందేశాలిస్తున్నట్టు

మమతా బెనర్జీ ప్రకటించిన 42 మంది ఎంపీల జాబితాలో అత్యంత వివాదాస్పదురాలు మహువా మొయిత్రా... గత ఏడాది పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకుందనే ఆరోపణలు ఎదుర్కొంది.

Written By: Suresh, Updated On : March 11, 2024 9:04 am

Mamata Banerjee

Follow us on

Mamata Banerjee: శారద స్కాం గుర్తుందా.. వందల కోట్లు చేతులు మారాయి. అందులో అధికార పార్టీ నాయకులు దర్జాగా దండుకున్నారు. కొంతమంది అధికారులు భారీగా వెనకేసుకున్నారు. అది బెంగాల్ చరిత్రలో భారీ కుంభకోణం అయినప్పటికీ.. ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ కించిత్ కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. నిందితులపై చర్యలు తీసుకుంటానని ప్రకటించలేదు.. పైగా సోదాలకు వచ్చిన దర్యాప్తు అధికారులపై దాడులు చేయించింది. సిబిఐ అధికారులపై ఉల్టా కేసులు పెట్టించింది. అన్ని వందల కోట్లు చేతులు మారినప్పటికీ దానిని మమతా బెనర్జీ సమర్ధించుకుంది. పైగా రాజకీయ నాయకులు స్కాములు చేయకుంటే ఏం చేస్తారంటూ? కొత్త భాష్యం చెప్పింది. అలాంటి మమతా బెనర్జీ నుంచి నీతిని ఏం ఆశించగలం? రాజకీయాల్లో సచ్చీలత ను ఎలా ఊహించగలం? పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు.. డబ్బులు వసూలు చేసిన మహువా మొయిత్రాకు మమత మళ్లీ టికెట్ కేటాయించిందంటే.. ఆమె కూర్పు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారికి టికెట్లు ఇచ్చి.. ఇలాంటి సందేశాలు ఇద్దామనుకుందో మమతకే తెలియాలి.

మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్నదో? లేదో? అది ఆమెకే తెలియాలి. హఠాత్తుగా ప్రధానమంత్రి మోడీ మీద ఫైర్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుంది. అంతే స్పీడుగా ప్రధానమంత్రి తో భేటీ అవుతుంది.. కాంగ్రెస్ పార్టీని కాదని ఎంపీ టికెట్లను ప్రకటిస్తుంది. ఆమె రాజకీయ అడుగులు ఏంటో? ఆమె పొలిటికల్ లెక్కలు ఏమిటో? ఎప్పటికీ అంతుపట్టవు. ఆదివారం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ మమత ధోరణి అలాగే ఉంది. ఆదివారం 42 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహువా మొయిత్రా కు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చింది. గతంలో ఆమె గెలిచిన కృష్ణా సాగర్ నుంచే మళ్లీ బరిలోకి దింపింది. దేశాన్ని కుదుపు కుదుపుతోన్న సందేశ్ ఖాళీ వివాదం నేపథ్యంలో అక్కడి సిట్టింగ్ ఎంపీ ను నుష్రత్ జహాన్ కు టికెట్ ను నిరాకరించింది. ఆస్థానాన్ని నురుల్ ఇస్లాం కు కేటాయించింది. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కు బెర్హంపూర్, శతృఘ్న సిన్హా కు అసన్ సోల్, కీర్తి ఆజాద్ కు దుర్గాపూర్ స్థానాలు కేటాయించింది

మమతా బెనర్జీ ప్రకటించిన 42 మంది ఎంపీల జాబితాలో అత్యంత వివాదాస్పదురాలు మహువా మొయిత్రా… గత ఏడాది పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకుందనే ఆరోపణలు ఎదుర్కొంది. దీనిపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీని నియమించింది. ఎథిక్స్ కమిటీ డబ్బులు తీసుకున్నట్టు నిరూపించింది.. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక కు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీంతో మహువా పై వేటు పడింది. అటువంటి మహిళకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మళ్లీ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. అది కూడా ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణా సాగర్ నియోజకవర్గం నుంచి. ఇలాంటి వారికి ఎంపీ టికెట్ ఇచ్చి.. మమతా బెనర్జీ రాజకీయాలలో ఎటువంటి విలువలు పాదుకొల్పుతున్నారో ఆమెకే తెలియాలి. దర్యాప్తు కోసం వచ్చిన కేంద్ర అధికారులపై దాడులు చేయించడం, ఎన్నికల్లో హింసకు పాల్పడటం, ఎన్నికల ముందు రకరకాల స్టంట్ లు చేయడం.. వంటి వాటిని ఒంట పట్టించుకున్న మమతా బెనర్జీ..మహువా లాంటి వాళ్లకు కాపోతే.. ఇంకెవరికి టికెట్లు ఇస్తుంది? అన్నట్టు 42 మంది ఎంపీ అభ్యర్థులను తమకు చెప్పకుండా మమత ప్రకటించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇంతకీ మమత ఇండియా కూటమిలో ఉన్నట్టా? లేనట్టా?