https://oktelugu.com/

Canada: భారతీయులతో పెట్టుకున్నాడు.. ‘ట్రూడో’కు మూడినట్టే

కెనడాలో ద్రవ్యోల్పణం పెరుగుతోంది. జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఆరోగ్యరంగం, ప్రజల ఇళ్లు కొనుగోలు శక్తి వంటి అంశాలు వచ్చే ఏడాది(2025)లో జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 11, 2024 / 09:15 AM IST

    Canada

    Follow us on

    Canada: కెనడాలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని జస్టిన్‌ ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోంది. సోస్ట్‌ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడోకు ఓటు వేసినవాళ్లే కావడం గమనార్హం.

    ఆర్థిక సంక్షోభంతో..
    కెనడాలో ద్రవ్యోల్పణం పెరుగుతోంది. జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఆరోగ్యరంగం, ప్రజల ఇళ్లు కొనుగోలు శక్తి వంటి అంశాలు వచ్చే ఏడాది(2025)లో జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నాన్‌ ప్రాఫిట్‌ అంగుస్‌ రెడ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ట్రూడో ప్రభుత్వంపై కేవలం 17 శాతం మాత్రమే ట్రూడో మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఇక 28 శాతం మంది నన్‌ ఆఫ్‌ ద ఎబో ఆప్షన్‌ ఎంచుకున్నారు.

    కన్జర్వేటివ్‌ నేతకు అనుకూలం..
    ఈ సర్వే ఫలితాలు కన్జర్వేటివ్‌ నేత ప్రియోర్రే పొలీవర్‌కు అనుకూలంగా వచ్చాయి. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్‌ పార్టీ 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ 206, లిబర్స్‌ 67 సీట్లు గెలుస్తాయని అంచనా.

    ఖలిస్థానీ ఉగ్రవాది హత్యతో..
    తొమ్మిది నెలల క్రితం కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచే భారత్, కెనడా మధ్య విభేదాలు తలెత్తాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ. ఇప్పటికే ఈ ఘటనపై కెనడా చేసిన ఆరోపణలను బారత్‌ తిప్పి కొట్టింది. తాజాగా హర్‌దీప్‌సింగ్‌ హత్యకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ హత్యపై కెనడా ప్రధాని ట్రుడో ప్రభుత్వం భారత్ పై సంచలన ఆరోపణలు చేసింది. వాటిని భారత్‌ గట్టిగానే తిప్పి కొట్టింది. ఈ క్రమంలోనే ఖాలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ హత్య వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను కెనడాలోని సీబీఎస్‌ న్యూస్‌ టెలికాస్ట్‌ చేసింది. ఇందులో 2023, జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని గురుద్వారా వెలుపల హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను కాల్చి చంపినట్లు ఉంది. ఇదిలా ఉంటే హర్‌దీప్‌ను భారత్‌ 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది.