Tiger Hunting: యానిమల్ ప్లానెట్ ఛానల్లో జింకను పులి వేటాడే దృశ్యాలు చూసి భయపడిపోతాం. పులి ఒక్కసారిగా ఎదుటి జంతువు మీద పడితే వణికి పోతాం. అలాంటిది ఈ ఫోటోగ్రాఫర్ ఓ పులి ఓ ఎద్దును వేటాడుతున్న దృశ్యాలను అత్యంత సమీపంలో ఉండి చిత్రీకరించాడు.. ఆ దృశ్యాలు ఫోటోల మాదిరి కాకుండా..లైవ్ గా ఇప్పుడే జరుగుతున్నట్టుగా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన జితేంద్ర చావేర్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. అతడికి వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఇందులో భాగంగా ఇటీవల అతడు ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ లో కొన్ని ఫోటోలు తీశాడు.. శారద ప్రధాన కాలువ పక్కన తారు రోడ్డు మీద ఓ ఎద్దును పులి వేటాడిన దృశ్యాలను అతడు చిత్రీకరించాడు. తారు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న ఓ అవును దూరంగా పొదల మాటున నక్కి ఉన్న ఓ పులి వెంబడించింది. కొంత దూరం వెళ్లిన తర్వాత వెనకనుంచి తన పంజాతో దెబ్బ కొట్టింది. ఆ ఎద్దు కింద పడిపోగానే ఒక్కసారిగా దాని గొంతును తన పదునైన దంతాలతో పులి పట్టుకుంది. ఫలితంగా ఎద్దు గిలగిలా కొట్టుకుంది. అయినప్పటికీ పులి దానిని వదిలిపెట్టలేదు. అలా దానిని పొదల్లోకి ఈడ్చుకు వెళ్ళింది.
ఈ దృశ్యాలను జితేంద్ర చావేర్ తన కెమెరాలో బంధించాడు. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. “మేము వైల్డ్ సఫారీ కి వెళ్ళాం. గుంపులో నుంచి ఎద్దు తప్పిపోయింది. అది శారద కాలువ పక్కన ఉన్న తారు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. కొంతసేపటి తర్వాత S2 అనే ఓ మగ పులి ఎద్దు వెనకనుంచి వచ్చింది. పులి రాకను గమనించిన ఎద్దు వాహనాల వైపు పరుగులు తీసింది. దీంతో ఆ పులి ఇక లాభం లేదనుకొని వెళ్లిపోయింది. అలా తారు రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వస్తున్న ఎద్దును మరో మగపులి.. దానిని బారాహి అని పిలుస్తారు. శారదా కాలువ పాయింట్ వద్ద ఉన్న దట్టమైన పొదల్లో అది దాక్కుని ఉంది. వెంటనే వెనుక వైపు నుంచి ఆ ఎద్దు పై దాడి చేసింది. వెనుక నుంచి దాడి చేసిన దృశ్యాన్ని, పులి తన పంజాతో ఎద్దును కింద పడేసిన దృశ్యాన్ని, పులి తన పదునైన దంతాలతో ఎద్దు మెడను కొరికిన దృశ్యాన్ని నా కెమెరాలో బంధించానని” జితేంద్ర చావేర్ పేర్కొన్నాడు. కాగా, ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More