
Dasara OTT: ఇటీవల కాలం లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించిన చిత్రం న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’.తాను ఎప్పుడూ తీసే బాయ్ 2 నెక్స్ట్ డోర్ సినిమాల జానర్ ని పక్కన పెట్టి, పూర్తి స్థాయి ఊర మాస్ అవతారం లోకి దిగిన చేసిన ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ రావడం తో స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోని వసూళ్లను రాబట్టింది.
కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ఇప్పటికీ కొంతమంది స్టార్ హీరోలకు రాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది.అప్పటి వరకు కేవలం 30 మార్కెట్ కి పరిమితమైన నాని, ఈ సినిమా తో ఏకంగా 60 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు.ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీ లోకి అడుగుపెట్టబోతుంది.ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ తో కొనుగోలు చేసింది.మూవీ రన్ కూడా దాదాపుగా అయిపోతుండడం తో వచ్చే నెల మొదటి వారం లోనే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

థియేటర్స్ కి వెళ్లడం మానేసిన కొంతమంది ప్రేక్షకులందరికీ ఇది శుభవార్త అని చెప్పొచ్చు.అంతే కాదు, ఒకసారి థియేటర్ లో సినిమాని చూసి మరోసారి థియేటర్ కి వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపని ఆడియన్స్ కూడా ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు.మరి థియేటర్స్ లో ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.