
Heroine Kushboo: 1990 దశకం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పెను తుఫానులాగా దూసుకొచ్చిన హీరోయిన్ కుష్బూ.తెలుగు లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె, ఆ తర్వాత తమిళం లో కూడా ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, అక్కడి కుర్రకారులకు ఆరాధ్య దేవతగా మారిపోయింది. అప్పట్లో ఈమెని ఆ రాష్ట్రం లో ఎంతలా అభిమానించేవారంటే ఈమె కోసం తమిళనాడు వ్యాప్తంగా టెంపుల్స్ కూడా కట్టారు అభిమానులు.
అలాంటి ప్రభంజనం సృష్టించిన కుష్బూ ఇప్పటికీ క్యారక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో బిజీ గా కొనసాగుతూనే ఉంది. అయితే కొన్ని సినిమాలు నటీనటులకు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి, అలా కుష్బూ కెరీర్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో ఉన్నాయి, అందులో తమిళం లో ఆమె చేసిన ‘చిన్న తంబీ’ అనే చిత్రం ఒకటి.ప్రభు హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో తమిళనాడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.
ఈ సినిమాని తెలుగు లో విక్టరీ వెంకటేష్ ‘చంటి’ పేరుతో రీమేక్ చేసాడు.ఇక్కడ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉండగా కుష్బూ – ప్రభు కలిసి నటించిన ‘చిన్న తంబీ’ అనే చిత్రం విడుదలై నేటి 32 ఏళ్ళు పూర్తి అయ్యింది.ఈ సినిమా షూటింగ్ సమయం లోనే కుష్బూ మరియు ప్రభు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమెని పెళ్లి చేసుకునే ముందే ప్రభు కి అప్పటికే పెళ్లి అయ్యింది,కుష్బూ ని పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో తెలిసిన తర్వాత పెద్ద గొడవలు అయ్యాయట.దీనితో తప్పనిసరి పరిస్థితులలో వీళ్లిద్దరి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి నాలుగు నెలల్లోనే విడాకులు తీసుకున్నారు.

చిన్న తంబీ విడుదలై 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుష్బూ సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.’ఈ చిత్రం విడుదలై అప్పుడే 32 ఏళ్ళు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. ఈ సినిమా తో నాకు ఎంతో ఎమోషనల్ కనెక్షన్ ఉంది, కోట్లాది మంది అభిమానులు మా పై కురిపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను.ఇక ప్రభు కోసం నా గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంది’ అంటూ ఆమె పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది.