
Prabhas: సాహూ మరియు రాధే శ్యామ్ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నుండి ఏ సినిమా ముందు రాబోతుందో అభిమానులకు సైతం అంతు చిక్కని ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్నాడు.అందులో ఆదిపురుష్ షూటింగ్ టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది.
ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది,మరోపక్క KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘సలార్’ మూవీ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఈ రెండు సినిమాలతో పాటుగా మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ K అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాలతో పాటుగా ఆయన యంగ్ డైరెక్టర్ మారుతీ తో కూడా గత కొంత కాలం నుండి ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రస్తుతం గోప్యంగానే ఉంచారు మేకర్స్.
ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలన్నిట్లో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’.ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గురించి ప్రతీ రోజు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో సలార్ మేకర్స్ ని ట్యాగ్ చేస్తూ అడుగుతూనే ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ‘ఉగాది’ కి విడుదల చేద్దాం అనుకున్నారట, కానీ ప్రభాస్ ఆపించాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

కారణం ‘సలార్’ చిత్రానికి సంబంధించి ఏ అప్డేట్ బయటకి వచ్చినా ఫ్యాన్స్ ఆ చిత్రం మీదనే ఫోకస్ చేస్తారని, జూన్ 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ‘ఆది పురుష్’ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోరని ప్రభాస్ అభిప్రాయం అట. అందుకే సలార్ టీజర్ ని ప్రభాస్ ఆపించేసాడని తెలుస్తుంది. అంటే ‘ఆదిపురుష్’ చిత్రం విడుదల అయ్యేంత వరకు సలార్ టీజర్ ని చూసే అదృష్టం ఫ్యాన్స్ కి లేదన్నమాట.