Titanic Submersible Missing: అట్లాంటిక్ మహాసముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురి వ్యక్తులను తీసుకెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదమైంది.. సముద్రం అంతర్భాగంలో తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్ పేలిపోయింది. ఈ పేలుడుతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. ఈ క్రమంలో ఈ సంఘటనకు సంబంధించి ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరున్ స్పందించారు. ఆ ప్రాంతంతో తనకు ఉన్న అనుభవాలు పంచుకున్నారు.
టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని కామెరూన్ పలుమార్లు సందర్శించారు. అయితే ఆ ప్రదేశంతో తనకు ఉన్న అనుభవాలను గతంలో ఆయన పంచుకోగా.. ఇప్పుడు అవి తెరపైకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. జేమ్స్ కామెరూన్ అవతార్, అవతార్_2 సహా ఎన్నో భారీ సినిమాలు తీశారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప దర్శకుడుని పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన తీసిన సినిమాల్లో టైటానిక్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఒక ఓడ సముద్రంలో ప్రమాదానికి ఎలా గురైందో ఆ రోజుల్లోనే ఆయన కళ్ళకు కట్టినట్టు చూపించారు. సముద్ర గర్భంలో 13 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ ను కామెరూన్ ఇప్పటికీ 33 సార్లు సందర్శించారు.. ఆ సందర్శన సందర్భంగా ఆ అనుభవాలను 2012లో మీడియాతో పంచుకున్నారు.
“మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు అంటే నాకు చాలా ఇష్టం అందుకే టైటానిక్ షిప్ మునిగిన ప్రాంతానికి వెళ్లాను. ఇది ఈ భూమి మీద అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ఒకటి” అని కామెరూన్ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ అనేది ఎవరెస్ట్ లాంటిదని కామెరున్ వ్యాఖ్యానించారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలని కోరికతో టైటానిక్ అనే సినిమా తీశానని అప్పట్లో కామెరూన్ చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రత్యేకంగా దానిని సినిమా తీయనున్న ఉద్దేశం తనకు లేదని కామెరూన్ వివరించారు.. మునిగిపోయిన టైటానిక్ చూడాలనే సముద్ర గర్భంలో సబ్ మెరైన్ లో ప్రయాణించినట్టు ఆయన వివరించారు. భాను ప్రేక్షకులకు బాగా చూపించాలని ఉద్దేశంతోనే టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని పలు మార్లు సందర్శించినట్టు కామెరూన్ చెప్పు కొచ్చారు.
ఇక టైటాన్ జలాంతర్గామి ప్రమాదంపై జేమ్స్ కామెరున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు..”ఈ ఘటన నాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.. ఇదో భయంకరమైన విషాదం. జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుండేది. భూమ్మీద అత్యంత కఠినమైన వాటిల్లో ఒకటి.. జలాంతర్గామి ప్రమాదానికి గురైనప్పుడు నేను చాలా ఆందోళన చెందాను. డీప్ సబ్ మెర్జన్స్ ఇంజనీరింగ్ కమ్యూనిటీలోని కొంతమంది అగ్రశ్రేణి సభ్యులు ఓషి గేట్ కంపెనీకి లేఖలు రాశారు.. వారు చేస్తున్నది చాలా ప్రయోగాత్మకం. కానీ ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం అత్యంత దారుణం” అని కామెరూన్ వ్యాఖ్యానించారు.