ట్రెండింగ్ న్యూస్Mumbai: చెంప దెబ్బ ఎంత పని చేసింది?!

Mumbai: చెంప దెబ్బ ఎంత పని చేసింది?!

Mumbai: అదే ముంబై రైల్వేస్టేషన్. ప్రయాణికులతో రద్దీగా ఉంది. వచ్చి పోయే రైళ్ళు ఆ ప్రాంతాన్ని హోరెత్తిస్తున్నాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏం జరిగిందని తోటి ప్రయాణికులు చూస్తే.. ఒక వ్యక్తి కళ్ళముందే ప్రాణాలు కోల్పోయాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే..

ముంబైలో అవినాష్, శీతల్ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరు మంఖార్డ్ వెళ్లడానికి సీయోను రైల్వే స్టేషన్ కు ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో దినేష్ (26) అనే యువకుడు శీతల్ పక్కనే నిలుచున్నాడు. అయితే అతడు తనను తోసేశాడని శీతల్ ఆరోపించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త పెద్ద గొడవగా మారింది. దినేష్ ను శీతల్ తన చేతిలో ఉన్న గొడుగుతో కొట్టింది. ఆ తర్వాత అవినాష్ కూడా తన భార్య శీతల్ కు జత కలిశాడు. దినేష్ ను బలంగా చెంప మీద కొట్టాడు. దీంతో దినేష్ ప్లాట్ ఫామ్ పై నుంచి రైల్వే ట్రాక్ పై పడిపోయాడు.

అయితే తిరిగి ప్లాట్ ఫామ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అంతలోనే అదే ట్రాక్ పై వేగంగా ఒక రైలు దూసుకు వస్తోంది. ఆ రైలు చూసి దినేష్ కు సహాయం చేసేందుకు వచ్చిన వారు కూడా పారిపోయారు. దీంతో రెప్పపాటులో ఆ రైలు దినేష్ పైనుంచి దూసుకుపోయింది. దీంతో దినేష్ అక్కడికక్కడే మరణించాడు. దినేష్ మరణంతో అవినాష్, శీతల్ పారిపోయారు. దారావి లోని తమ ఇంటికి వెళ్లిపోయారు. దినేష్ , శీతల్ ను పోలీసులు గుర్తించారు. వారినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు..

Dhurandhar 2: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 'ధురంధర్' సిరీస్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్ తో దర్శకత్వ ప్రతిభ కి చిరునామా అంటే ఏంటో అర్థం...

Mumbai Vs Karachi: ముంబై Vs కరాచీ.. ఆర్థిక రాజధానుల్లో ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువ?

Mumbai Vs Karachi: ఉపఖండంలో రెండు సముద్రతీర నగరాలు ముంబై, కరాచీ నగరాలు రెండు దేశాలకు ఆర్థిక రాజధానులుగా నిలిచాయి. సాధారణ స్థానం ఉన్నప్పటికీ, అభివృద్ధి వేగం, సామాజిక వైవిధ్యం, మౌలిక సదుపాయాల్లో...

Most Popular

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...

NEET 2026 : తండ్రి కిరాణ షాపు.. ముగ్గురు తోబుట్టువులు ‘నీట్’లో ర్యాంకులు..

NEET 2026: బలమైన సంకల్పం.. కష్టపడి చదవాలనే తపన ఉంటే ఆర్థిక ఇబ్బందులు కూడా విజయాన్ని అడ్డుకోలేవని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నిరూపించారు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి...

Pawan Kalyan : పేర్ని నాని మాటలకు నిరంజన్ ఎంత బాధ పడ్డాడో చూడండి.. చివరి మాటలు చూస్తే...

Pawan Kalyan : వరంగల్ చెందిన నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని రీసెంట్ గానే కన్నుమూసిన ఘటన యావత్తు ప్రజానీకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. చిన్న తనం నుండి జెన్యూ సంబంధిత...

Raj Kumar : ప్రశాంతంగా చ*చ్చాడు.. కాల్చి చం*పా*ల్సింది సర్..రాజ్ కుమార్ సోదరుల వీడియో వైరల్

Raj Kumar : సైకో కి*ల్ల*ర్ రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అతడు సోమవారం ఉదయమే చనిపోయినట్టు తెలుస్తోంది. నిర్మానుష్యమైన ప్రాంతంలో అతడి మృతదేహం...

Perni Nani : నా బిడ్డ చనిపోవడానికి కారణం పేర్ని నాని నే అంటూ నిరంజన్ తండ్రి హాట్...

Perni Nani : ఇటీవలే పవన్ కళ్యాణ్ వరంగల్ కి చెందిన నిరంజన్ అనే వీరాభిమాని , జెన్యు సంబంధిత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడం తో, అతని కోరిక ని నెరవేర్చేందుకు అతని...
Exit mobile version