Supreme Court: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే పురాతన కాలంలో జరిగిన వివాహాలు 100 ఏళ్ల వరకు సంతోషంగా ఉండేవి. కానీ నేటి కాలంలో స్వేచ్ఛ, స్వాతంత్రం పేరు చెప్పి కొందరు పెళ్లయిన కొన్నాళ్లకే భర్త నుంచి లేదా భార్య నుంచి విడిపోతున్నారు. చిన్నచిన్న మనస్పర్దాలకే విలువైన వివాహ జీవితానికి దూరం అవుతున్నారు. కారణాలు ఎన్ని ఉన్నా.. సమస్యలు ఎన్ని వచ్చినా.. జీవిత భాగస్వామి తోనే జీవితమని కొందరు అనుకుంటే.. మరికొందరు మాత్రం చిన్న సమస్యకే ఏమాత్రం కలిసి ఉండలేం.. అంటూ విడాకుల కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. హలో వివాహక కోర్టు మెట్లు ఎక్కి తనకు వివాహ జీవితం వద్దని.. అలాగే కోరుకున్న భరణం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే సుప్రీం కోర్ట్ పరిధిలోకి వచ్చిన ఈ కేసు పై ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే?
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ముంబై కి చెందిన ఓ మహిళ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్దల కారణంగా విడిపోవాలని అనుకుంది. 18 నెలలు మాత్రమే కలిసి ఉన్న ఈమె భర్తకు దూరంగా ఉండాలని కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడి న్యాయమూర్తులు సంచలన తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా వివాహిత తనకు భరణం కింద రూ. 12 కోట్లు ఇవ్వాలని.. ముంబైలోని ఖరీదైన ఫ్లాట్ ఇవ్వాలని కోరింది.
దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ.. భరణం అనేది ఆడవారి సెక్యూరిటీకి మాత్రమే ఉండాలని.. అధికంగా సంపాదించేలా ఉండకూడదని చెప్పారు. అంతేకాకుండా నువ్వు విద్యావంతురాలివే కదా..? ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అంతేకాకుండా భరణం కింద కేవలం లగ్జరీ ఫ్లాట్ మాత్రమే వస్తుందని.. ఎలాంటి డబ్బు రాదని న్యాయమూర్తులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో మహిళ షాక్ లోకి వెళ్ళింది.
అయితే చాలామంది మహిళలు ఇలాగే మరణం కోసం కోర్టుమెట్లు ఎక్కుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. భర్తతో ఏదైనా సమస్య ఉంటే దానిపై పోరాటం చేయాలని.. అంతేకాకుండా పిల్లలు లేదా ఇతర విషయాల్లో అవసరాలకు తగ్గట్లుగా మరణం అడగాలని.. చెప్పారు. చాలా కేసుల్లో భరణం కోసమే కోర్టుకు వస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక తాజా తీర్పులో కేవలం 18 నెలల వివాహ బంధానికి రూ. 12 కోట్లు అడగడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. అంతేకాకుండా ఉన్నత చదువులు చదివిన వారు ఇలా కేవలం డబ్బు కోసం ఈ పనులు చేయకూడదని.. బాగా చదివిన వారికి నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అందువల్ల సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలని చెప్పారు. అంతేకాకుండా లగ్జరీ ఫ్లాట్ లేదా రూ.4 కోట్ల వరకు నగదు మరణం కింద ఇస్తారని చెప్పారు.