Childhood Photo: 1970 -1980 కాలంలో సినీ ఇండస్ట్రీ స్వర్ణయుగం. అప్పటి వరకు నాటకాలు వేసేవారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ పర్ఫామెన్స్ ను చూపించడంతో స్టార్లుగా ఎదిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేటితరం వారిని కూడా అలరిస్తున్నారు. ఏజ్ బార్ అయినా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. తెలుగు, తమిళం అని తేడా లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఓ హీరో దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయనకు సంబంధించిన చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా? లేకపోతే కిందికి వెళ్లండి.
కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ స్టైల్ తో ఆకట్టుకున్న ఆ హీరో ఎవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తెరపై కనిపిస్తే చాలు.. ఆ థియేటర్లోకి పరుగులు తీసే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. తమిళం, తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లోనూ ఆయనకు విపరీత ఫ్యాన్స్ ఉన్నారు. ఒక రకంగా ఫ్యాన్ష్ కోరిక మేరకే రజనీ ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తున్నారని అనుకోవచ్చు. ఇటీవల రిలీజ్ అయిన జైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన చిన్న నాటి ఫొటో వైరల్ అవుతోంది.
రజనీకాంత్ 1950 డిసెంబర్ 12న కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జన్మించారు. ఆయన అసుల పేరు శివాజీ గైక్వాడ్. ఆయన తల్లి గృహిణి, తండ్రి రామోజీరావు. రజనీకాంత్ 9 ఏళ్ల వయసులో ఉండగానే తల్లిని కోల్పోయాడు. ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆ తరువాత రామకృష్ణ మఠంలో చేరిన తరువాత ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా అలవరుచుకున్నాడు. ఒకసారి మఠంలో చేసిన నాటకంలో ఆయన ఏకలవ్యుడి పాత్రను వేశాడు. దీంతో ఆయనకు కన్నడ కవి డీఆర్ బెంద్రే నుంచి ప్రశంసలు దక్కాయి. అప్పటి నుంచి రజనీకాంత్ కు నటనపై ఆసక్తి పెరిగింది.
పాఠశాల విద్య పూర్తయిన తరువాత అనేక పనులు చేశాడు. చివరికి బెంగుళూరు ట్రాన్స్ పోర్టు సర్వీస్ లో కండక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. అయితే అదే సమయంలో కొత్తగా ఏర్పడిన మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన తో ఆయన నటనలో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సహోద్యోగి రాజ్ బహదూర్ సహాయంతో ఇందులో చేరాడు. రజనీకాంత్ కు ఆయనే ఆర్థిక సాయం కూడా చేశాడు. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న సమయంలో బాలచందర్ దృష్టిలో పడ్డాడు. దీంతో అతనికి 1975లో కె. బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత రజనీ మానియా ప్రారంభమైంది.