Lottery: లాటరీ.. కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వరించే అద్రుష్టం. అందునా రెండేళ్ల వ్యవధిలోనే రెండు సార్లు లాటరీ దక్కించుకంటే వారిని అద్రుష్ట జాతకులంటారు. ఈ జాబితాలోకి వస్తారు దుబాయ్ లో ప్రవాస భారతీయుడు సునీల్ శ్రీధరన్ . కేరళకు చెందన శ్రీధరన్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలీనియరీ డ్రాలో ఒక మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.6.50 కోట్లు గెలుచుకున్నాడు. అయితే, శ్రీధరన్ ఇలా వన్ మిలియన్ డాలర్లు గెలవడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2019లో తొలిసారి మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే మనోడికి రెండుసార్లు జాక్‌పాట్ తగిలిందన్నమాట. కాగా, ఇప్పటివరకు ఇలా మిలీనియం మిలియనీర్ డ్రాలో రెండుసార్లు విజేతలుగా నిలిచిన వారిలో శ్రీధరన్ ఎనిమిదో వ్యక్తి అని రాఫెల్ నిర్వాహకులు వెల్లడించారు. బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో శ్రీధరన్ విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 10వ తేదీన అతడు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ 388, లాటరీ టికెట్ నం.1938 శ్రీధరన్‌కు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో రాత్రికి రాత్రే అతడి బ్యాంక్ ఖాతాలోకి రూ.6.50కోట్లు వచ్చిపడ్డాయి. దుబాయ్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ బిజినెస్ చేసే 55 ఏళ్ల శ్రీధరన్ 20 ఏళ్ల నుంచి దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుంటానని తెలిపాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, 1999లో ప్రారంభమైన మిలీనియం మిలియనీర్‌లో 1మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో సునీల్ శ్రీధరన్ 188వ వ్యక్తి.

Also Read: Narendra Modi: మోడీనే టార్గెట్.. కాంగ్రెస్ మేథోమథనం
కొద్దిరోజుల కిందట..
కొద్దిరోజుల కిందటే అబుదాబిలో తమిళనాడుకు చెందిన దక్షిణమూర్తి మీనాచిసుందరం లాటరీలో రూ.కోటి రూపాయలు గెలుగుచుకున్నాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మినా సుందరం 9 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. అక్కడ ఓ గృహనిర్మాణ సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. నెలకు 2,500 దిర్హమ్స్(రూ.52వేలు) జీతం వస్తుంది. కాగా, దక్షిణమూర్తి గత ఐదేళ్లుగా అబుదాబి బిగ్‌టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన కుమారుడి పుట్టిన తేదీ కలిసొచ్చేలా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. తాజాగా అబుదాబిలో నిర్వహించిన వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో అతడు కొనుగోలు చేసినా టికెట్ నంబర్‌కే లాటరీ తగిలింది. దాంతో ఏకంగా 5లక్షల దిర్హమ్స్(భారత కరెన్సీలో సుమారు రూ. 1.05కోట్లు) గెలుచుకున్నాడు. ఇలా కొడుకు బర్త్‌డే దక్షిణమూర్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించారు. వరసగా లాటరీలు తగలడంతో ప్రవాస భారతీయులు, అందున రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వారు విజేతలుగా నిలవడంతో దుబాయి, అబుదాబిలో లాటరీలకు గిరాకీ పెరిగింది. లాటరీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అన్నట్టు యూఏఈలో భారతీయులు ఎక్కువ.
Also Read: Electricity Employees: జీతాలు అడిగితే ఎస్మా..విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కారు ఝలక్
[…] […]