Homeఆంధ్రప్రదేశ్‌Rajya Sabha: రాజ్యసభ పదవులు వారికేనా?.. వారి ఆశలపై నీళ్లు చల్లిన సీఎం జగన్

Rajya Sabha: రాజ్యసభ పదవులు వారికేనా?.. వారి ఆశలపై నీళ్లు చల్లిన సీఎం జగన్

Rajya Sabha: గడపగడపకు వైసీపీ ప్రభుత్వ కార్యక్రమంతో శ్రేణులు బిజీగా ఉండగా.. సీఎం జగన్ రాజ్యసభ స్థానాల భర్తీపై ద్రుష్టిపెట్టారు. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభ పదవీ కాలం ముగిసిన కీలక నేత విజయసాయరెడ్డికి మరో ఛాన్స్ లభించే అవకాశం ఉంది. మరో స్థానాన్ని ఇప్పటికే తన సన్నిహిత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీకి కేటాయించారు. ఇంకా మిగిలి ఉన్న రెండు స్థానాల్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ఎంపిక చేసినట్టు సమాచారం. ఇందుకుగాను సూత్రప్రాయంగా సీఎం జగన్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. నాలుగో స్థానం బీద మస్తాన్ రావు పేరు పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయన గడిచిన సార్వత్రిక ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఒకవేళ మహిళా కోటలో కిల్లి క్రుపారాణిని ఎంపిక చేస్తే.. ప్రీతి అదానీ బదులు గౌతమ్ అదానీకి బెర్త్ ఖాయమయ్యే అవకాశం ఉంది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో.. అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ స్థానాల ఎంపిక విషయంలో వైసీపీలో మెజార్టీ వర్గాలు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో బలం లేని నాయకులకు పదవులు అప్పగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న వారికి కాకుండా ఎన్నికల అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యమిస్తుండడాన్ని మెజార్టీ పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి. సీఎం జగన్ చర్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని భావిస్తున్నారు.

CM Jagan
Rajyasabha

శ్రేణుల్లో అసంత్రుప్తి

అయితే ఈ నాలుగు పేర్లలో విజయసాయిరెడ్డి వరకూ అభ్యంతరం లేకున్నా.. మిగతా ముగ్గురు విషయంలో మాత్రం పార్టీ శ్రేణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ఎందుకు పదవి కేటాయిస్తున్నారో వైసీపీ నేతలకు సైతం తెలియడం లేదు. గత సారి రిలయన్స్ కోటలో నత్వానికి పదవి ఇచ్చారు. ఈసారి అదాని తన్నేసుకుపోతున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఇవ్వాల్సింది.. తనకు ప్రయోజనం చేకుర్చిన పారిశ్రామిక వేత్తలకు జగన్ పదవులిస్తున్నారన్న అనుమానం వైసీపీ శ్రేణులను వెంటాడుతోంది. వాస్తవానికి రాజ్యసభ స్థానాలపై డజను మందికిపైగా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో సినిమారంగం వారు సైతం ఉన్నారు. వారు పార్టీకి ఎలాగోలా సేవలందించిన వారే. అందులో ముఖ్యంగా స్టార్ కమేడియన్ అలీ ఓకరు. టీడీపీలో ఉన్న ఆయన సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టిక్కెట్ ను సైతం ఆశించారు. కానీ దక్కలేదు. అలాగని ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అలీకి సముచిత స్థానం ఉంటుందని భావించారు. ముందుగా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అన్నారు. తరువాత రాజ్యసభ అని లీకులిచ్చారు. ముహూర్తం చూసుకోవాలని సైతం చెప్పారు. కానీ ఇప్పుడు జాబితాలో ఆయన పేరు లేదు. పోసాని క్రిష్ణమురళీ, మోహన్ బాబు వంటి వారు సైతం పదవి ఆశించారు. కానీ దక్కలేదు.

Also Read: Y S Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి అయిన ‘లేడీ’ ఎవరూ?

మేకపాటికి మొండిచేయి

వైసీపీలో ఉన్న కీలక నేతలు సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇటీవలే కుమారుడు మరణంతో పుట్టెడు విషాదంలో ఉన్న మేకపాటి సైతం పదవిని ఆశించారు. కానీ వీరెవ్వరికీ జాబితాలో చోటు దక్కలేదు. ఇప్పటికే విజయసాయిరెడ్డికి చాన్ష్ ఇవ్వనుండడంతో వారి పేర్లు తెరమరుగయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే విపక్షాలపై కుల ముద్ర వేసి మాట్లాడే వైసీపీ.. రెడ్డి సామాజికవర్గీయులకు పదవులు కేటాయిస్తే మొదటికే మోసం వస్తుందని సీఎం జగన్ భావించినట్టు ఉన్నారు. ఎలాగైనా వారికి సముదాయిస్తే ఊరుకుంటారని అనుకొని ఉంటారు. అయితే మేకపాటి విషయంలో మాత్రం అన్యాయం జరిగిందన్న టాక్ నడుస్తోంది. పార్టీ ఆవిర్బావం నుంచి మేకపాటి కుటుంబం జగన్ వెన్నంటే నడిచింది. కానీ అందుకు తగ్గ ప్రాధాన్యం మాత్రం ఆ కుటుంబానికి దక్కలేదు. రాజ్యసభ రూపంలోనైనా చాన్ష్ వస్తుందని వ్రద్ధ నేత భావించారు. కానీ పెద్దల సభకు పంపించేందుకు జగన్ మొగ్గుచూపడం లేదు.

Rajya Sabha
Vijayasai Reddy

Also Read: Narendra Modi: మోడీనే టార్గెట్.. కాంగ్రెస్ మేథోమథనం
Recommended Videos
బలంపై జనసేనకు ఫుల్ క్లారిటీ.. || Special Story on Janasena Pawan Kalyan Confidence || Ok Telugu
ప్రపంచంలో సెక్యులరిస్టు ప్రభుత్వాల స్వభావం ఎలా ఉంది? | Analysis on Secularist Governments | RAM Talk
చంద్రబాబు అరెస్ట్ కు భారీ స్కెచ్..| CM Jagan Target to Arrest Chandrababu | YSRCP vs TDP | Ok Telugu
గూగుల్‌లో ఈ మూడు విషయాలు వెతికితే జైలుకే || 3 Things You Should Never Google || Ok Telugu

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version