Leopard Hunting: సోషల్ మీడియాలో కొన్నివీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు వీక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఎక్కడో అడవుల్లో ఉండే జంతువులు ఎలా జీవిస్తాయి? వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. జంతువులన్నింటిలో చిరుత (Leopard) గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. మిగతా జంతువుల కంటే ఇది వేగంగా పరుగెడెతుంది. ఏ చెట్టయినా ఎక్కగలుగుతుంది. ఈ చిరుత ఇటీవల చేసిన విన్యాసం తెగ వైరల్ అవుతోంది. ఓ ఫారెస్ట్ అధికారి పోస్టు చేసిన ఈ వీడియోను 3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం..
కొన్ని జాతి వైరాల జంతువుల మధ్య నిత్యం శత్రుత్వం ఉంటుంది. ఒకదానిని అంతం చేసి మరొకటి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుంది. అడవిలో మృగరాజు సింహం తరువాత అంతటి శక్తి లేకపోయినా.. చురుగ్గా వ్యవహరిస్తూ ఆహారాన్ని సంపాదించుకునే జంతువు చిరుత మాత్రమే. చిరుతకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ చెట్టుపైకైనా వెళ్లగలదు. ఎక్కడైనాదూకగలదు. దీనిలో ఉండే వెన్నుముక అలా సహకరిస్తుంది. అయితే మరో జంతువు కోతి (Monkey)తామేం తక్కువ కాదని నిరూపిస్తాయి. ఇవి వేసే జంప్స్ తో మిగతా వాటికి దొరకకుండా తప్పించుకుంటాయి.
ఈ వీడియోలో కోతిని అంతం చేయడానికి చిరుత ప్రయత్నిస్తూ ఉంటుంది. కోతి వెనకాల మెల్లగా వెళ్తుంది. అయితే ఇది గమనించిన కోతి కాసేపటి తరువాత ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు జంప్ కొడుతుంది. వాస్తవానికి కోతి కొమ్మలను పట్టుకొని కూడా ఆగగలదు. ఆ ఉద్దేశంతో కోతి వేరే చెట్టుపై దూకి కొమ్మలను పట్టుకుంది. కానీ చిరుత పట్టు విడవకుండా అంతే ఊపుతో జంప్ కొట్టి కోతిని పట్టేసింది. మొత్తానికి చిరుత తన లక్ష్యాన్ని అధిగమించింది.
15 జూలై 2023న సుశాంత్ నంద అనే ఫారెస్ట్ అధికారి ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేశాడు. ఈ వీడియో వీక్షకులను తెగ ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ వీడియో లక్షల కొద్దీ వ్యూస్ సంపాదించుకుంటోంది. లైక్ లకు లెక్కలేకుండా పోతుంది. దీనిని భట్టి చూస్తే జంతువులకు సంబంధించిన వీడియోలపై వీక్షకులకు ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఇక వీడియోపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ‘చిరుతపులులు నమ్మశక్యం కాని బలాన్ని ఉంటాయి. వాటికి ఇష్టమైన చెట్టుపై 50 అడుగుల పైకి ఎగరగలవు’ అని అన్నారు.
This is why Leopards are known as most opportunistic and versatile hunters😊 pic.twitter.com/ZFjCOkukL9
— Susanta Nanda (@susantananda3) July 15, 2023