Youth Not Married: పెళ్లెప్పుడు అవుతుంది బాబూ? నాకు పిల్లను ఎవరు ఇస్తారు బాబూ? 90 వ దశకంలో ఒక ఊపు ఊపిన పాట ఇది. బహుశా భవిష్యత్తును ముందే ఊహించి ఈ పాట రాశారేమో.. ఆ పాటలో తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. అమెరికా నుంచి ఇండియా వరకు పెళ్లిళ్లు కాకుండా చాలామంది యువకులు బ్రహ్మచారులను మిగిలిపోతున్నారు. ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాల్లో 8 రెట్లు జనాభా పెరిగింది. అనితర సాధ్యమైన అభివృద్ధి సాధ్యమైంది. కానీ ఇదే సమయంలో వ్యక్తిగతంగా స్వేచ్ఛ పెరగడం వల్ల మనుషుల జీవితాల్లో సమూలంగా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు చేసుకున్నవారు విడాకులు తీసుకోవడం, అసలు పెళ్లిళ్లు చేసుకోకుండానే ఒంటరిగా తమ ఇళ్లల్లో జీవిస్తున్నారు. ఇలాంటి ఏకాకి బతుకులు లేదా కుటుంబాల సంఖ్య మంచి ప్రగతి సాధించిన దేశాల్లోనే ఒక మోస్తరు వేగంతో పెరుగుతోంది.
అమెరికాలో ఏక సభ్య కుటుంబాలు
అన్ని రంగాల్లో తిరుగులేని అభివృద్ధిని సాధించిన అమెరికా వంటి దేశంలో ఏక సభ్య కుటుంబాలు పెరుగుతున్నాయి. వివాహం పై విరక్తి చెందడం, లేదా వైవాహిక జీవితం పై ఆసక్తి లేకపోవడం వంటి కారణాలవల్ల చాలామంది ఒంటరిగానే మిగిలిపోతున్నారు.. ఇటువంటి సంస్కృతి పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన ఆ దేశం.. దీని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలియక మదనపడుతోంది. ఇక రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాలోనూ ఇదే పరిస్థితి ఉంటున్నది. అక్కడ గృహింస అనేది పెరిగిపోవడంతో చాలామంది పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు.. ఇటీవల చైనా మధ్య ప్రావిన్స్ లో వరుసగా మహిళలు హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. దీనికి కారణం అక్కడ గృహహింస పెరిగిపోవడమే. ఇటువంటివి అక్కడ యువతలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది పెళ్లి చేసుకునేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు.
మనదేశంలోనూ..
ఇక భిన్నత్వానికి ప్రతీకగా నిలిచే భారతదేశంలోనూ చాలామంది యువత పెళ్లి చేసుకోవడం లేదు. కొంతమంది వివాహం చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు. అయితే వీరిపై ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలిసాయి. పెళ్లి చేసుకుంటే బాధ్యతలను మోయాల్సి ఉంటుందని, చదువు కెరియర్ అలాంటి పాఠాలనే నేర్పిస్తున్నప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవడం దేనికని కొంతమంది వాదిస్తున్నారు. ఇంకా కొన్నిచోట్ల పురుషులకు తగ్గట్టుగా స్త్రీలు లేకపోవడంతో చాలామందికి పెళ్లిళ్లు కావడం లేదు. కెరియర్ వేటలో పడి చాలామంది సరైన వయసు ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇక ఆర్థిక స్థిరత్వం బాగా పెరిగిపోవడంతో అభిప్రాయ భేదాలు వల్ల చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. ఫలితంగా మనదేశంలోనూ ఏక వ్యక్తి కుటుంబాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ పరిణామం పట్ల సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మనుషుల విచ్చిన్నానికి కారణం అవుతున్నాయని, ఇవి ఇలానే కొనసాగితే కుటుంబాలు అనేవి ఉండవని వారు హెచ్చరిస్తున్నారు..