Baby Movie: బేబీ మూవీలో పచ్చి బూతులు, సన్నివేశాలు… సెన్సార్ ఏం చేస్తున్నట్లు!

హీరోయిన్ ని తిట్టే క్రమంలో బూతు పదాలు వాడారు. కొన్ని చోట్ల బీప్ పెట్టినా కొన్ని చోట్ల వదిలేశారు. చాలా డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి. అక్కడక్కడా సన్నివేశాలు పిల్లలు చూడకూడని కంటెంట్ కలిగి ఉన్నాయి.

Written By: Shiva, Updated On : July 18, 2023 1:01 pm

Baby Movie

Follow us on

Baby Movie: బేబీ మూవీ కంటెంట్ విషయంలో డిజిటల్ సిరీస్లను మించిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ చూస్తే సెన్సార్ సభ్యులు ఎందుకు కట్స్ చెప్పలేదనే సందేహాలు కలుగుతున్నాయి. దీనిపై నెటిజెన్స్ మధ్య చర్చ మొదలైంది. అందులోనూ ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే చిన్నపిల్లలు పేరెంట్స్ తో పాటు హ్యాపీగా చూడొచ్చని సర్టిఫికెట్ ఇచ్చారు. కంటెంట్ మాత్రం ఏ( పెద్దవాళ్లకు మాత్రమే) సర్టిఫికెట్ స్థాయిలో ఉంది.

హీరోయిన్ ని తిట్టే క్రమంలో బూతు పదాలు వాడారు. కొన్ని చోట్ల బీప్ పెట్టినా కొన్ని చోట్ల వదిలేశారు. చాలా డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి. అక్కడక్కడా సన్నివేశాలు పిల్లలు చూడకూడని కంటెంట్ కలిగి ఉన్నాయి. దీంతో పలువురు సెన్సార్ సభ్యుల పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సినిమాల విషయంలో చిన్న చిన్న పదాలకు కూడా అభ్యంతరం చెప్పే సెన్సార్ సభ్యులు కొన్ని సినిమాల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇటీవల విడుదలైన దసరా మూవీకి భారీగా కట్స్ చెప్పారు. కేవలం వాడుక భాషలో భాగం జోడించిన కొన్ని బూతులకు కట్స్ చెప్పారు. లేదంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. పాటల్లో, డైలాగ్స్ లో అనేక పదాలను తొలగించారు. ఈ పదాలు వాడుక భాషలో వచ్చేవే. తప్పుడు భావంతో పలికేవి కాదు. బేబీ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చి ఇలాంటి పదాలు, సన్నివేశాలను ఎలా వదిలేశారనే చర్చ జరుగుతుంది.

ఇక బోల్డ్ కంటెంట్ మూవీ అంటూ ప్రచారం జరగడం బేబీకి ప్లస్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 తరహా చిత్రమట అని యూత్ కి ఒక సందేశం వెళ్ళింది. దాంతో ఎగబడి చూస్తున్నారు. బేబీ మొదటి రెండు రోజులకే లాభాల్లో అడుగుపెట్టింది. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించగా… ఎస్కేఎన్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలు చేశారు.