Snake Fight: కింగ్ కోబ్రా.. పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇక కనిపిస్తే.. బతుకు జీవుడా అంటూ పారిపోవాల్సిందే. అంతటి ప్రమాదకరమైన పాము కింగ్‌కోబ్రా. అత్యంత విషపూరితమైన ఈ పాము మరో బలమైన పామును కాటేసింది. అది ఊరుకుంటుందా.. తనను కాటేసిన కింగ్ కోబ్రాను ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఈ అరుదైన ఘటనకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ నందా ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
మనుషుల మాదిరిగానే..
మనిషిలో ఒకరి ఎదుగుదలను ఓర్చే తత్వం సన్నగిల్లుతోంది. ఎదుగుతున్న వారిని కిందకు లాగడం, అణచివేయడం ఎలా అని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం వక్రమార్గాలను అనుసరిస్తున్నాడు. అచ్చం అలాగా అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాకు అత్యంత పొడవు, బరువైన కొండ చిలువ తనకంటే బలంగా కనిపించినట్లుంది. దానిని అంత చేయాలనే పగతో కాటేసింది. కానీ నింజగా బలమైన కొండ చిలువ తనను కాటేసిన కింగ్ కోబ్రాను వదిలిపెట్టలేదు.
నాతోపాటే నువ్వు…
తనతోపాటే తనను కాటేసిన కింగ్ కోబ్రాను చుట్టేసింది కొండచిలువ. ఊపిరి ఆడకుండా నలిపేసింది. దీంతో కింగ్‌కోబ్రా కొండ చిలువ కౌగిట్లో నలిగి ఎముకలు విరిగి.. బయటకు వెళ్లలేక.. విడిపించుకునే ఓపిక లేక.. చివరకు చనిపోయింది. ఇక కొండ చిలువ కూడా అంత్యం విషప్రభావంతో చనిపోయింది.
The python suffocated the King Cobra while the king cobra bit it. Both snakes died, one from asphyxiation and the other from the venom.
And that is how we people destroy each other. History is witness to such madness… pic.twitter.com/mLykX8rvMD— Susanta Nanda (@susantananda3) July 7, 2023