30 Crore Job: ప్రపంచంలో అనేక రకాల ఉద్యోగాలు ఉంటాయి. చదువును బట్టి కొన్ని ఉద్యోగాలు ఉంటే.. ఎలాంటి చదువుల లేకపోయినా చేసే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఏ ఉద్యోగమైనా నైపుణ్యం తప్పనిసరి. నైపుణ్యం ఉన్నవారికే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ప్రైవేటులో అయితే ఎక్కవ వేతనాలకు కంపెనీలు జాబ్ ఆఫర్ ఇస్తుంటాయి. ఇక కొందరు తమ టాలెంట్‌కు తగ్గ ఉద్యోగం కావాలని ఎదురు చూస్తుంటే.. ఇంకొందరు.. ఏ ఉద్యోగం అయితేనేం.. జీతం వస్తే చాలు అనేవారు చాలా మంది ఉంటారు. మెజారిటీ నిరుద్యోగులు ఇప్పుడు ఇలాగే అడ్జెస్ట్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ ఉద్యోగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వేతనం భారీగా ఉంది.. కానీ ఏపని చేయడానికి అయినా సిద్ధమనేవారు కూడా ఈ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. భారీగా వేతనం ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికీ ఆ పోస్టు భర్తీ కావడం లేదు. చాలా మంది భయంతో పారిపోతున్నారు. మరి ఆ ఉద్యోగం ఏంటి.. వేతనం ఎంత.. ఎందకు భయపడుతున్నారు అనే వివరాలు తెలుసుకుందాం.
సముద్రంలో జాబ్..
ఈజిప్ట్ సముద్ర తదీరంలో పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రాలో ఫారోస్ లైట్‌హౌస్ ఉంది. ఇందులో లైట్‌ను ఎపుపడూ ఆగిపోకుండా చూసుకునేందుకు ఓ ఉద్యోగి కావాలి. లైట్ నిరంతరం వెలుగుతూ ఉండడం ముఖ్యం. ఆ పని చూసుకుంట లైట్‌హౌస్‌లోనే ఉండాలి. అంతకు మించి వేరే పని ఉండదు. ఎవరూ ఫోన్లు చేయరు. ఫలానా పని చేయమని ఒత్తిడి చేయరు. జీతం ఏడాదికి రూ.30 కోట్లు. ఇంత భారీ వేతనం ఇస్తామన్నా.. ఎవరూ ఆ ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం లైట్‌హౌస్ సముద్రం మధ్యలో ఉండడమే కారణం. అలలు ఎగిసి పడుతంటాయి. మాట్లాడేందుకు కనుచూపు మేరలో ఎవరూ కనిపించరు. ఒంటరిగా జీవించాలి. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ వెలిగేలా చూసుకోవడమే ఉద్యోగి చేయాల్సిన పని.
లైట్‌హౌస్ అత్యంత కీలకం..
ఇదిలా ఉంటే.. ఈజిప్ట్ సముద్రంలో ఉన్న ఈ లైట్ హౌస్ ఆ దేశానికి అత్యంత కీలకం. సముద్రంలో నౌకలు అటువైపు రాకుండా చూసేందుకు లైట్ వెలుగుతూ ఉండాలి. ఎందుకంటే సముద్రంలో అటువైపు రాళ్లు ఉంటాయి. అవి తగిలితే నౌకలు ప్రమాదానికి గురవుతాయి. సముద్ర మార్గం అటు కాదని చెప్పడానికి లైట్ ఆన్‌లో ఉండాలి. దానికోసమే లైట్‌హౌస్ నిర్మించారు. అక్కడ అలలు కూడా భారీగా ఉంటాయి. ఒక్కోసారి లైట్‌హౌస్ మునిగిపోతుంది కూడా.
భయం కారణంగానే..
లైట్ హౌస్ మునిగిపోయినా.. ఈదుకుంటూ బయటకు రావచ్చు. కానీ, అక్కడ ఒంటరిగా బతకడం చాలా కష్టం అందుకే ఆ ఉద్యోగం చేయడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. చచ్చిపోతామన్న భయంతోనే వెనక్కి వెళ్తున్నారు. దీంతో ఇప్పటికీ ఆ పోస్టు ఖాళీగానే ఉంది. లైట్ వెలుగుతూ ఉండేలా చూసుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. లైట్ హౌస్ నిర్మాణం కూడా ఓ ఇంజినీరింగ్ అద్భుతమే. అంతటి అలల మధ్య, బండరాళ్లపై దీనిని నిర్మించారు. ఇందుకు సంవత్సరాలు పట్టింది. చెక్కతోపాటు రాయి, మెటల్‌ను ఇందుకు వినియోగించారు.
లైట్ ఎలా వెలుగుతంది?
అంతా ఒకే.. కానీ లైట్ వెలగడానికి అక్కడ విద్యుత్ ఎక్కడిది అనే సందేహాలు కూడా వస్తాయి. నిజమే. కానీ, ఆ లైట్ మంటతో వచ్చే లైట్. అంటే మంట ఎప్పుడూ ఆరిపోకుండా చూసుకోవాలి. మీకు ఆసక్తి ఉంటే దరకాస్తు చేసుకోవచ్చు. పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రియాను సంప్రదించవచ్చు.