https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో జరిగేదంతా నిజమేనా..? లేదంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా..? అసలు ఆ షో లో ఏం జరుగుతుంది..?

తెలుగులో చాలా షో లు ఉన్నప్పటికీ కొన్నింటికి మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. నిజానికి బిగ్ బాస్ లాంటి షో కి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అయితే ఉంది. ఇక ఈ షో లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 18, 2024 / 11:31 AM IST

    bigg boss telugu 8

    Follow us on

    Bigg Boss 8 Telugu: తెలుగులో అత్యంత పెద్ద షో ఏదైనా ఉంది ఏంటి అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తనదైన రీతిలో టిఆర్పి రేటింగ్ సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇక ప్రస్తుతం ‘బిగ్ బాస్ సీజన్ 8’ నడుస్తున్న నేపధ్యంలో ఇంతకుముందు ఏ సీజన్ కి రాని గుర్తింపు ఈ సీజన్ కి వస్తుందంటూ బిగ్ బాస్ యాజమాన్యం ప్రచారం అయితే చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో రాకతో మిగిలిన షోలన్నీ ఢీలా పడిపోయాయి. నిజానికి వంద రోజుల పాటు ఒక ఇంట్లో ఉంటూ వాళ్ళు చేసే ఆక్టివిటీస్ అన్నింటినీ ఇక కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలన్నింటినీ బిగ్ బాస్ హ్యాండిల్ చేస్తూ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని తేల్చి చెప్పడంతో అభిమానులు కూడా చాలావరకు ఆ షో ని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. నిజానికి మనలో చాలామందికి బిగ్ బాస్ షోలో జరిగేది అంత నిజమా? లేదంటే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా? అనే అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇక కొందరు నిజంగానే జరుగుతుంది అని అనుకున్నప్పటికీ, మరి కొంతమంది మాత్రం స్క్రిప్ట్ బేస్డ్ గా జరుగుతూ ఉంటుంది అని వాళ్లకు వాళ్లు సర్ది చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అయితే అక్కడ జరిగేది చాలావరకు స్క్రిప్ట్ బేస్డ్ గానే జరుగుతుంది. నిజానికి బిగ్ బాస్ షో కి రాయాడానికి చాలామంది రైటర్లు కూడా ఉంటారు.

    ఇక రైటర్లు కంటెస్టెంట్ల మధ్య జరిగే టాస్కులు ఎలా ఉండాలి అనేది రాస్తూనే ఎవరి మీద ఎవరు పాజిటివ్ ఓపెనియన్ తో ఉండాలి. ఎవరి మధ్య గొడవలు పెట్టేలా టాస్క్ లను ఏర్పాటు చేయాలి అనేది ఆలోచిస్తూ స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు. అయితే టాస్క్ లను స్క్రిప్ట్ ప్రకారం డిసైడ్ చేసినప్పటికీ ఆ టాస్కులు ఆడేటప్పుడు మాత్రం కంటెస్టెంట్ల మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెష్ అనేవి రావచ్చు. దానివల్ల ఒకరిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి.

    ఆ గొడవలు జరగడం వల్లే షోకి అంత పాపులారిటీ వస్తుంది. అలాగే ప్రేక్షకులు కూడా ఆసక్తిగా షో ను చూస్తూ ఉంటారు ఫలితంగా ఆ షో కి టిఆర్పి రేటింగ్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏదో ఒక కాంప్లికేటెడ్ పాయింట్ వచ్చేలా రైటర్లు టాస్క్ లను రాస్తూ ఉంటారు. అలాగే ఒక టాస్కులో ఎవరెవరు గొడవపడలి అనేది కూడా వాళ్లే డిసైడ్ చేసి రాస్తూ ఉంటారని కొంతమంది బిగ్ బాస్ షో కి రైటర్లుగా చేసిన వాళ్లు చెబుతూ ఉంతారు. మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది బయట జనాలకి తెలియదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే బిగ్ బాస్ లో చాలా వరకు స్క్రిప్ట్ బేస్డ్ గానే మూవ్ అవుతూ ఉంటారు అనేది మాత్రం వాస్తవమని తెలుస్తుంది.

    ఇక బిగ్ బాస్ షో కి దాదాపు 5 నుంచి 6 మంది రైటర్లు ఉంటారని సమాచారం అయితే అందుతుంది. మరి స్క్రిప్ట్ బేస్డ్ గా నడవనప్పుడు దానికి అంత మంది రైటర్లు ఎందుకు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే కంటెస్టెంట్ల మధ్య గొడవ పెట్టుకోవడం వాళ్లని వాళ్లు దూషించుకుంటూ ఉంటే చూసే అభిమానులు కూడా ఉత్సాహం పెరుగుతుంది. దాని వల్లే ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారనే ఉద్దేశ్యంతో షో యాజమాన్యం అలా చేస్తున్నట్టుగా తెలుస్తుంది…