https://oktelugu.com/

Viral Video: విమానం అంటే విహంగ ప్రయాణమే కాదు.. కంటతడి పెట్టిస్తుంది, గుండెతడిని తట్టి లేపుతుంది.. వీడియో వైరల్

తమిళనాడు రాష్ట్రం చెన్నై రాజధాని చెందిన ప్రదీప్ ది.. దిగువ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటినుంచి అతడికి పైలెట్ కావాలనే కోరిక ఉండేది. ఆ దిశగానే అతడు తన చదువు కొనసాగించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 6, 2024 4:46 pm
    Viral Video

    Viral Video

    Follow us on

    Viral Video: డబ్బున్న వాళ్లకు విమానమంటే ఒక ప్రయాణ సాధనం. మరీ డబ్బున్న వాళ్లకు అది ఒక చాపర్.. మరి మిడిల్ క్లాస్ వాళ్లకు.. అంతకంటే పేదవాళ్లకు.. విమానం అంటే ఆకాశంలో చక్కర్లు కొట్టే యంత్ర విహంగం.. అందులో ప్రయాణం చేయడం అంటే వారికి అసాధ్యం. అందుకే విమానాన్ని ఆకాశంలో చూసి కేరింతల కొడుతుంటారు. ఈ కాలంలోనూ విమానాన్ని విచిత్రమైన వస్తువుగా చూస్తుంటారు. అందులో ప్రయాణాన్ని స్వర్గ లోకపు దారులకు పయనం గా భావిస్తుంటారు.. అలా భావించే తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యులు చాలామంది మన దేశంలో ఉన్నారు. అలాంటి వారిలో ఆ యువకుడి తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య కూడా ఉన్నారు. వారి కలను ఆ యువకుడు నెరవేర్చాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

    తమిళనాడు రాష్ట్రం చెన్నై రాజధాని చెందిన ప్రదీప్ ది.. దిగువ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటినుంచి అతడికి పైలెట్ కావాలనే కోరిక ఉండేది. ఆ దిశగానే అతడు తన చదువు కొనసాగించాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ పైలట్ అయ్యాడు. చిన్నప్పుడు ప్రదీప్ ను అతడి తాతయ్య స్కూటర్ మీద తిప్పేవాడు. ఆ రోజుల్లోనే అతని తాతయ్యతో విమానంలో తిప్పుతానని చెప్పేవాడు. అతడు చెప్పినట్టుగానే దానిని ఆచరణలో పెట్టాడు. అలా తన తల్లిదండ్రులను, తాతయ్య, నానమ్మను విమానంలో తీసుకెళ్లాడు. అంతేకాదు తొలిసారి వారు విమానంలో ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో.. ఫ్లైట్ ప్యాసింజర్ వింగ్లోకి వచ్చి స్పెషల్ అనౌన్స్మెంట్ చేశాడు. ప్రదీప్ అనౌన్స్మెంట్ చేస్తుండగా అతని తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు.

    ప్రదీప్ కు చిన్నప్పటినుంచి పైలెట్ కావాలనే కోరిక ఉండేది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ అతని కష్టపడి తన చదువును కొనసాగించాడు. దానికోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మనదేశంలో పైలెట్ కోర్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆయనప్పటికీ అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ పైలట్ కోర్సు పూర్తి చేసి విమానాన్ని నడిపే స్థాయికి చేరుకున్నాడు. అంతేకాదు తను నడుపుతున్న విమానంలోనే తల్లిదండ్రులను, తాతయ్య, నానమ్మలను తీసుకెళ్లాడు.

    ఈ దృశ్యాన్ని వీడియోను రూపంలో ప్యాసింజర్ తన ఫోన్లో తీశాడు.. దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. “అతడు తన చిన్నప్పుడు చెప్పినట్టుగానే పైలట్ అయ్యాడు. తాతయ్య స్కూటర్ మీద తిరిగి ఆనందాన్ని అనుభవించాడు. అదే ఆనందాన్ని తన తాతయ్యకు ఇలా విమాన ప్రయాణ రూపంలో తిరిగి అందించాడు. ఎంతైనా ప్రదీప్ అభినందనీయుడు”..”తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వేస్తున్న ఈ రోజుల్లో.. ఈ కొడుకు చేసిన పని చాలామందిలో స్ఫూర్తి నింపుతుంది. అంతేకాదు కొంతమందికి గుణపాఠం లాగా నిలుస్తుంది. తొలిసారి విమాన ప్రయాణం చేస్తున్న వారికి శుభాకాంక్షలు”. “మేము చాలాసార్లు విమాన ప్రయాణం చేశాం. ఎన్నడూ ఇంతటి అనుభూతికి గురి కాలేదు. బహుశా ప్రయాణమంటే ఆస్వాదించడం కాబోలు.. ప్రదీప్ చేసిన ప్రయత్నానికి అభినందనలు” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.