SRH Vs CSK 2024: GOAT లాంటి ధోని ఉన్నా… అంతటి తప్పు చెన్నై ఎలా చేయగలిగింది?

చెన్నై జట్టు ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఐదు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 20 ఓవర్లలో కేవలం 165 రన్స్ మాత్రమే చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 6, 2024 4:41 pm

SRH Vs CSK 2024

Follow us on

SRH Vs CSK 2024: బలమైన చెన్నై జట్టు హైదరాబాద్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్లు చెన్నై జట్టు చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. అందులో చెన్నై జట్టు చేసిన ఒక తప్పిదం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అన్నింటికీ మించి మహేంద్రసింగ్ ధోని ఉన్నప్పటికీ కూడా అలాంటి తప్పు చెన్నై ఎలా చేయగలిగిందనే అనుమానం ఆ జట్టు అభిమానుల్లో కలుగుతోంది. వాస్తవానికి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై జట్టు ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఐదు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 20 ఓవర్లలో కేవలం 165 రన్స్ మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని చూసి చెన్నై అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న చెన్నై జట్టు ఇంతటి తక్కువ స్కోరు చేయడానికి ప్రధాన కారణం.. ఆ నిర్ణయమేనట..

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. కెప్టెన్ కమిన్స్ తన బౌలర్లతో వైవిధ్యంగా బౌలింగ్ చేయించాడు. ఫలితంగా 25 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కెప్టెన్ గైక్వాడ్ గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. అజంక్య రహనే, శివం దూబె కాసేపు చెన్నై జట్టు స్కోరును పరుగులు పట్టించినప్పటికీ.. వారి భాగస్వామ్యానికి కూడా కమిన్స్ అడ్డుకట్ట వేయగలిగాడు. ఇటీవల చెన్నై జట్టు ఆడిన మ్యాచ్లలో ఈ స్థాయిలో తడబాటుకు గురికావడం ఇదే మొదటిసారి. అయితే ఇలా చెన్నై జట్టు ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ లైనప్ లో తీసుకున్న నిర్ణయాల కారణమట. అందువల్లే ఆ జట్టు తక్కువ స్కోర్ చేసిందట.

ఈ మ్యాచ్లో శివం దూబె అవుడైన తర్వాత రవీంద్ర జడేజా ప్రమోషన్ తీసుకొని ఫిఫ్త్ టౌన్ లో వచ్చాడు. నిజానికి ఆ సమయంలో మొయిన్ అలీ రావాల్సి ఉంది. అందరు కూడా అదే భావించారు. కానీ అందుకు భిన్నంగా చెన్నై జట్టు ప్రయోగం చేసింది. జడేజాను పంపించింది. జడేజా 23 బంతుల్లో 31 పరుగులు చేశాడు. వాస్తవానికి జడేజా కంటే మొయిన్ అలీ భీకరమైన బ్యాటర్. అతడికి కనక అవకాశం ఇచ్చి ఉంటే చెన్నై జట్టు స్కోరు తక్కువలో తక్కువ 180 పరులకు చేరేది. ఇక రహనే అవుట్ అయిన తర్వాత మిచెల్ వచ్చాడు. అప్పుడు కూడా అలీకి అవకాశం ఇవ్వలేదు. మిచెల్ 11 బంతుల్లో 13 రన్స్ మాత్రమే చేశాడు. ఇక 20 ఓవర్ లో మిచెల్ అవుట్ అయిన తర్వాత ధోని రంగంలోకి దిగాడు. ఎదుర్కొన్న రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసాడు. దీంతో చెన్నై జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. greatest of all time లాంటి ధోని ఉన్నప్పటికీ కూడా చెన్నై జట్టు ఇలాంటి విఫల ప్రయోగాన్ని ఎలా చేసిందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.. రవీంద్ర జడేజాను ముందుగా బ్యాటింగ్ కు ఎందుకు పంపారంటూ దెప్పి పొడుస్తున్నారు.