UP Husband And Wife: భార్యలకు భయపడేభర్తలు చాలా మందే ఉంటారు. కట్టుకున్న ఆలికి భయపడి ఆమె చెప్పినట్లు చేసేవారు ఎందరో ఉన్నారు. ఇంటి పని, వంట పని చేసిపెట్టి ఇంటిల్లి చాకిరి చేసి మరీ ఉద్యోగానికి వెళ్లే పతులు మనకు కనిపిస్తూనే ఉంటారు. దీంతో భార్యలు భర్తలపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటారు. చీటికి మాటికి కొడుతూ భర్తలను నిరంతరం భయపెట్టే భార్యలుండటం సహజమే. కానీ అందరు అలాంటి శాడిస్టులు ఉండరు. కొందరు పతియే ప్రత్యక్ష దైవమని భావించి వారి సేవలోనే తరిస్తుంటారు.

అందుకే కార్యేశు దాసి కరణేషు మంత్రి భోర్జేషు మాతా శయణేషు రంభ అంటుంటారు. అంటే భార్య పని చేసేటప్పుడు దాసిలా, పని చేసేటప్పుడు మంత్రిలాగా, అన్నం పెట్టే సమయంలో తల్లి, పడక గదిలో రంభలో భర్తను చూసుకుంటుంది. అలాంటి భార్యలున్న మన దేశంలో భర్తలనే తమ చెప్పుచేతల్లో పెట్టుకునే భార్యలుండటం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన వింత గొలుపుతోంది. కట్టుకున్న వాడినే భయపెట్టడంతో అతడు చెట్టు ఎక్కి అక్కడే ఉంటున్నాడు. రేయింబవళ్లు చెట్టుమీదే సహవాసం చేస్తున్నాడు.
Also Read: External Affairs Minister Jaishankar: మోడీ విదేశీ మంత్రదండం వెనుక అతడు!
యూపీలోని కోపగంజ్ కు చెందిన రామ్ ప్రవేశ్ తన భార్య కొడుతోందని ఓ వంద అడుగుల పామ్ చెట్టు ఎక్కాడు. వారం రోజులుగా అక్కడే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు తాడు సాయంతో అన్నం, నీళ్లు అక్కడికే పంపిస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఏమైందని అడిగితే తమ ఇళ్లల్లో ఏం జరుగుతుందో చూడాలని ఆ చెట్టు ఎక్కాడని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఎంత ప్రయత్నించినా కిందకు దిగడం లేదు. అతడు దిగిరాకపోవడంతో పోలీసుల అతడిపై కేసు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు. దీంతో అతడి కష్టం పగవాడికి కూడా రాకూడదని పలువురు పేర్కొనడం గమనార్హం.

భార్యకు భయపడి చెట్టు ఎక్కడం విమర్శలకు తావిస్తోంది. కట్టుకున్న పెళ్లానికి జడిసి చెట్టు ఎక్కడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లానికి బుద్ధి చెప్పాల్సింది పోయి భయపడటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పెళ్లాం చెబితే వినాలి కాని తిడితే పడితే ఇలాగే ఉంటుంది. భార్యను కంట్రోల్ లో పెట్టుకోవాలి. పెళ్లానికి గుద్ది చెప్పాలి బుద్ధి అని అంటుంటారు. జీవితభాగస్వామిని నియంత్రణలో ఉంచుకోకపోతే ఇలాంటి దుష్పరిణామాలే వస్తుంటాయి. ఏదిఏమైనా రామ్ ప్రవేశ్ చేసిన పనికి అందరు సిగ్గుపడుతున్నారు.
Also Read:KTR vs BJP: ‘బూట్లు మోసుడు లొల్లి’: కేటీఆర్ సెటైర్ కు బీజేపీ కౌంటర్లే కౌంటర్లు


[…] […]