Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లే. వరుస పరాజయాలు ఆమెకు అవకాశాలు లేకుండా చేశాయి. బిగినింగ్ లో చెప్పుకోదగ్గ హిట్స్ పడినా ఆమె గట్టి పునాది వేసుకోలేకపోయారు. అవకాశాలు లేని లావణ్య బరువు పెరిగినట్లనిపిస్తున్నారు. ఆమె రీసెంట్ ఫోటోలు చూస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది. అందాల రాక్షసి మూవీతో వెండితెరకు పరిచయమైన లావణ్య ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. హోమ్లీ ఫేస్, కట్టిపడేసే నటన ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా చేశాయి.
అనంతరం సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ హిట్స్ ఫేమ్ తీసుకొచ్చాయి. అయితే ఒక హిట్ పడితే వరుసగా రెండు మూడు ప్లాప్స్ పడేవి. 2019లో విడుదలైన అర్జున్ సురవరం పాజిటివ్ టాక్ అందుకుంది. తర్వాత విడుదలైన మూడు చిత్రాలు ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో కొంచెం గ్యాప్ తీసుకొని హ్యాపీ బర్త్ డే మూవీ చేశారు. ఇటీవల విడుదలైన హ్యాపీ బర్త్ డే సైతం ఆమెకు నిరాశే మిగిల్చింది.
ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు. సోషల్ మీడియాలో మాత్రం అందుబాటులో ఉంటున్న లావణ్య బరువు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సన్నజాజి తీగలా ఉన్న ఆమె కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు. మరోవైపు ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ ఈమెని ప్రేమిస్తున్నట్లు కొన్నాళ్లుగా వినిపిస్తుంది. లావణ్య లాస్ట్ బర్త్ డే నాడు పెళ్లి ప్రకటన కూడా వచ్చేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటి ప్రకటనేమీ రాలేదు.
మేము స్నేహితులం మాత్రమే ప్రేమికులం కాదని ఈ జంట ఖండించారు కూడా. మా మధ్య ఏమీ లేదంటూనే తరచుగా పార్టీలలో పాల్గొనడం అనుమానాలు రేపుతోంది. రాజస్థాన్ లో జరిగిన నిహారిక వివాహానికి కేవలం లావణ్యకు మాత్రం ఆహ్వానం దక్కడం విశేషం. మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరైన ఈ వివాహంలో అవుట్ సైడర్స్ రీతూ వర్మ, లావణ్య కనిపించారు. ఇటీవల సైతం ఓ కామన్ ఫ్రెండ్ పార్టీలో లావణ్య, వరుణ్ పాల్గొన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. వీళ్ళ రిలేషన్ పై క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే. ఏదైనా నిప్పులేనిదే పొగరాదంటారు కదా.