Curry leaves: మనకు లభించే ఆకుల్లో కరివేపాకుకు ప్రాధాన్యం ఉంటుంది. కూరలో కరివేపాకును తేలిగ్గా తీసేస్తారు కానీ అందులో ఉండే పోషకాలు మామూలువి కావు. కరివేపాకులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లతో మనకు అనేక లాభాలు కలుగుతుంటాయి. వీటిని ఎవరు గుర్తించరు. పప్పులో రుచి కోసం వేసుకున్న కరివేపాకును కూర ఉడికిన తరువాత తీసేయడం మూర్ఖత్వమే. ఎందుకంటే దాంతో మనకు అనేక ప్రయోజనాలు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. అందుకే తొలగిస్తుంటారు. కూరలో కరివేపాకును తీసేయడమంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవడం.

కరివేపాకులో ప్రొటీన్లు, మినరల్స్ ఉండటంతో రక్తహీనత సమస్య రాదు. దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవడం ఉత్తమమే. కంటికి కూడా ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఏ విటమిన్ వల్ల కంటి చూపు మందగించకుండా చేస్తోంది. దీన్ని వాసన చూడటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ కంట్రో ల్ లో ఉండేందుకు దోహదపడుతుంది. ప్రతి రోజు కొంచెం కరివేపాకు పొడిని అన్నం కంటే ముందు తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని తెలుస్తోంది.
Also Read: UP Husband And Wife: భార్య కొడుతోందని చెట్టెక్కిన భర్త.. వీడి కష్టం పగవాడికి కూడా రావద్దు స్వామీ
బరువు తగ్గాలనుకునే వారు కూడా కరివేపాకులతో సులభంగా తగ్గొచ్చు. వ్యాయామంతో పాటు రోజు గుప్పెడు తాజా కరివేపాకు ఆకులను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ప్రొటీన్ల వల్ల మన శరీరానికి ఎన్నో రకాల మేలు కలుగుతుంది. మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల్ని దృఢంగా ఉంచేందుకు సాయపడుతుంది. గర్భిణులు ఈ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే వాంతులు, వికారం తగ్గుతాయి. రక్తహీనత సమస్య కూడా రాకుండా నివారించుకోవచ్చు.

కరివేపాకును రోజువారీ ఆహారంలో తీసుకుంటే జుట్టు నెవరడం ఉండదు. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. కరివేపాకు వాడటం వల్ల అల్జీమర్స్ వ్యాధి కూడా రాకుండా పోతోంది. కరిపాకులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరును సరిచేస్తాయి. రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యలు కూడా దూరమవుతాయి. విరేచనాలు, గనేరియా, ఒళ్లు నొప్పులు వంటివి తగ్గుతాయి. కరివేపాకుతో ఇన్ని లాభాలు ఉన్నందున వాటిని కూరలో నుంచి తీసేయకుండా తిని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.
Also Read:Lavanya Tripathi: అవకాశాలు కరువు బరువెక్కుతున్న అందాల రాక్షసి లావణ్య

