https://oktelugu.com/

Odisha: కాసేపట్లో పెళ్లి.. పెళ్లి పందిట్లో వరుడి అరెస్ట్‌.. సంబరాల్లో బంధువులు!

ఒడిశాలోని బార్‌గఢ్‌ జిల్లాలో ఢెంకానాల్‌కు చెందిన అజిత్‌కుమార్‌ భోయ్‌ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఇటీవలే బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి వివాహ ముహూర్తం నిర్ణయించారు. దీంతో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ధూంధాంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వరుడు అజిత్‌కుమార్‌ వధువు ఇంటికి వచ్చాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 27, 2023 / 12:57 PM IST
    Follow us on

    Odisha: పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు పెద్దలు. అక్కడ నిశ్చయం కాని పెళ్లి చేయడానికి మనం ప్రయత్నం చేసినా అది ఆగిపోతుంది. ఇలా పందిట్లో ఆగిపోయిన పెళ్లిళ్లు చాలా ఉన్నాయి. ఇక పెళ్లి పందిట్లోకి పోలీసులు వచ్చి పెళ్లి ఆపేయడం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ నిజమైన పోలీసులు.. నిజంగా జరుగుతున్న పెళ్లిని ఆపేశారు. పచ్చని పందిట్లోనే వరుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

    ధూంధాంగా ఊరేగింపు..
    ఒడిశాలోని బార్‌గఢ్‌ జిల్లాలో ఢెంకానాల్‌కు చెందిన అజిత్‌కుమార్‌ భోయ్‌ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఇటీవలే బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి వివాహ ముహూర్తం నిర్ణయించారు. దీంతో పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ధూంధాంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వరుడు అజిత్‌కుమార్‌ వధువు ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ పెళ్లి పందిరి సిద్ధం చేశారు. ఇక కల్యాణమే తరువాయి అన్నట్లుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    పోలీసుల ఎంట్రీ..
    పెళ్లి ముహూర్తానికి కాస్త సమయం ఉండడంతో వరుడు అజిత్‌కుమార్‌ అక్కడే కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరోవైపు పెళ్లి వంటలు రెడీ అవుతున్నాయి. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుండడంతో బంధువులు, మిత్రులు, ఇతరులు మండపానికి చేరుకుంటున్నారు. ఇంతలో భువనేశ్వర్‌ పోలీసులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే వరుణ్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు.

    ప్రియురాలికి మాటిచ్చి.. మరో యువతితో వివాహం..
    అజిత్‌ కుమార్‌ భువనేశ్వర్‌కు చెందిన ఓ యువతిని రెండేళ్లు ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని మాట ఇచ్చాడు. అన్నిరకాలుగా ఆమెను వాడుకున్నాడు. మోజు తీరడంతో కట్నం కోసం మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో అజిత్‌కుమార్‌ ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిత్‌కుమార్‌కు పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి వివాహాన్ని అడ్డుకున్నారు. అజిత్‌ను అరెస్ట్‌ చేసి భువనేశ్వర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

    వధువు బంధువుల సంబరాలు..
    పెళ్లి మధ్యలో ఆగిపోయిందని వధువు బంధువులు బాధపడలేదు. అజిత్‌కుమార్‌ మోసగాడని తెలియడంతో మధ్యలోనే పెళ్లి ఆగిపోయినందుకు సంతోష పడ్డారు. అదే పెళ్లి మండపంలో డీజే పాటలకు స్టెప్పులేశారు. మరోవైపు అజిత్‌కుమార్‌ ప్రియురాలు కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేసి పెళ్లి చేయాలని పోలీసులు యత్నిస్తున్నారు.