Homeట్రెండింగ్ న్యూస్Coconut Diet: అన్నం తినడు.. కూర ముట్టడు.. ఇతడికి కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరే ఆహారం.....

Coconut Diet: అన్నం తినడు.. కూర ముట్టడు.. ఇతడికి కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరే ఆహారం.. ఎందువల్లంటే?

Coconut Diet: కోటి విద్యలు కూటి కొరకే. అయితే ఆ కూటిలో చాలామంది వైవిధ్యం ప్రదర్శిస్తారు. కొంతమందికి రోజు ముద్దలో ముక్కలేనిదే గొంతులోకి దిగదు. మరి కొంతమందికి శాఖాహారం అంటేనే ఇష్టం. ఇంకొంతమంది అయితే “ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా” అంటూ వేడి అన్నంలోకి నెయ్యి, పప్పు, ఆవకాయ, అప్పడాలు ఇలా ఎన్నో రకరకాల వంటకాలు తింటూ ఉంటారు. అయితే ప్రతిరోజు, ప్రతి పూట ఒకే ఆహారం తినాల్సి వస్తే? ఎలా ఉంటుంది.. ఎలా ఉండడం ఏంటి జీవితం మీద వైరాగ్యం వస్తుంది.. ఇదే బతుకు రా బాబూ అంటూ చిరాకు కలుగుతుంది. అయితే అలాంటిది ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒకే తరహా ఆహారాన్ని గత దశాబ్ద కాలంగా తీసుకుంటున్నాడు.

కేరళ రాష్ట్రం కాసర గోడ్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ పలాయి గత 28 సంవత్సరాలుగా కేవలం కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి తింటూ జీవితం కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి “గ్యాస్ట్రో ఈసో ఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) అనే వ్యాధి ఉంది. వ్యాధి వల్ల అన్న వాహిక చివర ఉండే కండరం సరిగ్గా మూసుకోదు. దీంతో, ఏ ఆహారం తిన్నా గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరం తో నీరసించి, ఒక్కోసారి కుప్పకూలిపోతారు. ఏమీ తినలేరు. చివరికి జావా లాంటిది తాగినప్పటికీ జీర్ణం కాదు. పైగా కడుపు ఉబ్బరం, మంట విపరీతంగా ఇబ్బంది పెడతాయి. బాలకృష్ణ కూడా ఇలా చాలా రోజులు ఇబ్బంది పడ్డవాడే. ఎన్నో ఆసుపత్రులు తిరిగాడు. అల్లోపతి, యునాని, ఆయుర్వేదిక్, నాచురో పతి, వంటి వైద్య విధానాల్లో మందులు వాడినప్పటికీ అతని వ్యాధి తగ్గలేదు.

అయితే వైద్యుల సిఫారసు మేరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకునేవాడు. తను ఉండేది కేరళ కాబట్టి, అక్కడ కొబ్బరికాయలు ఎక్కువగా లభిస్తాయి కాబట్టి.. తను తీసుకునే ఆహారంలో కొబ్బరినీళ్ళకు కూడా ప్రాధాన్యం ఇచ్చాడు. అయితే కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే తనకు ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో.. వాటిని క్రమక్రమంగా తన ఆహారంలోకి చేర్చుకున్నాడు. కొబ్బరి నీళ్ల తర్వాత లేత కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టాడు. దీని వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఇక తన ఆహారం కేవలం కొబ్బరి మాత్రమే అని గ్రహించుకున్నాడు. అలా తినడం వల్ల అతడికి కడుపు ఉబ్బరం అనే సమస్య రాలేదు. కొబ్బరినీళ్ళలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ పదార్థాలు ఉంటాయి. ఇది అనేక రకాల వ్యాధులను దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో 94 శాతం మీరే ఉంటుంది. ఇది శరీరంలో వ్యర్ధాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కొబ్బరి నీళ్లు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. రోజూ కొబ్బరినీళ్లు తాగటం వల్ల అధిక రక్తపోటు సమస్య నివారించవచ్చు. గుండెజబ్బులు, హృదయ వైఫల్యాల ముప్పును తగ్గించడంలో కొబ్బరి నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. కొబ్బరినీళ్ళల్లో ఎన్నో రకాల ఖనిజలవణాలు ఉంటాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరిని ఆహారంగా తీసుకుంటున్న బాలకృష్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు. అంతేకాదు అతడు లోకల్ క్లబ్ లో తనకు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ ఆడుతూ ఫుట్ బాల్ ప్లేయర్ గా విజయాలు సాధిస్తున్నాడు. బాలకృష్ణ ఆహారము చూసి ఓ మీడియా ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకునే వ్యక్తిగా బాలకృష్ణ రికార్డు సృష్టించాడు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version