https://oktelugu.com/

World Cup Trophy History: వరల్డ్ కప్ ట్రోఫీ ని మొదటి సరిగా ఎవరు తయారు చేసారు ఆ ట్రోఫీ ధర ఎంతో తెలుసా..?

1975 వ సంవత్సరం లో వన్డే వరల్డ్ కప్ జరిగింది.ఈ వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో జరిగింది దీనికి ప్రపంచం లో ఉన్న క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాల్గొన్నప్పటికీ ఇందులో వెస్టిండీస్ టీం వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది.

Written By: , Updated On : September 22, 2023 / 05:41 PM IST
World Cup Trophy History

World Cup Trophy History

Follow us on

World Cup Trophy History: ప్రపంచకప్ వస్తుంది అంటే చాలు క్రికెట్ అభిమానులందరికి చాలా పెద్ద పండగ అనే చెప్పాలి.ఎందుకంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచం లో క్రికెట్ ఆడే దాదాపు పది దేశాలు కూడా ఐసీసీ నిర్వహించే ఈ మ్యాచ్ లు ఆడుతూ అందులో గెలిచి వాళ్ల సత్తా చూపించుకోవాలి అని చాలా దేశాలు చూస్తూ ఉంటాయి.ఇక అందులో భాగంగానే ఈ ఇయర్ ఇండియా వేదికగా అక్టోబర్ 5 వ తేదీ నుంచి వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవుతుంది.మొదటి మ్యాచ్ గా డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టీం ల మధ్య ఒక భారీ మ్యాచ్ తో ఈ ఇయర్ వరల్డ్ కప్ అయితే జరుగుతుంది.ఇక ఇది ఇలా ఉంటె అసలు వరల్డ్ కప్ అనేది ముందు ఎక్కడ స్టార్ట్ అయింది, వరల్డ్ కప్ దేనితో తయారుచేయబడి ఉంటుంది.దాని విలువ ఎంత అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ (1975 )
1975 వ సంవత్సరం లో వన్డే వరల్డ్ కప్ జరిగింది.ఈ వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో జరిగింది దీనికి ప్రపంచం లో ఉన్న క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాల్గొన్నప్పటికీ ఇందులో వెస్టిండీస్ టీం వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది.ఇక ఐసీసీ ప్రతిష్టాత్మకం గా నిర్వహించిన ఈ వరల్డ్ కప్ ని మొదటి సారి గా వెస్టిండీస్ గెలుచుకొని క్రికెట్ చరిత్రలో మొదటి వరల్డ్ కప్ గెలిచినా టీం గా నిలిచింది.అయితే మొదటి వరల్డ్ కప్ కి ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ అనే పేరు ని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ ఇయర్ ప్రుడెన్షియల్ అనే ఒక భీమా సంస్థ వరల్డ్ కప్ కి స్పాన్సర్ గా వ్యవహరించింది. కాబట్టి వాళ్ళ గుర్తు గా దానికి ఈ పేరు పెట్టడం జరిగింది…

ఇక ఆ ఇయర్ లోనే కాకుండా దాని తర్వాత 1979 ,83 లలో కూడా ఈ కంపెనీ వారే వరల్డ్ కప్ కి స్పాన్సర్స్ గా వ్యవహరించారు.అయితే 1979 లో కూడా వెస్టిండీస్ టీం మరోసారి వరల్డ్ కప్ కొట్టడం జరిగింది.ఇక 1983 వ సంవత్సరం లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఇండియా టీం వరల్డ్ కప్ కొట్టి కొత్త హిస్టరీ ని క్రియేట్ చేసింది.

ఇక 1987 వ సంవత్సరం లో రిలియన్స్ ఇండస్ట్రీస్ కొత్తగా వరల్డ్ కప్ కి స్పాన్సర్స్ గా మారడం తో రిలియన్స్ ట్రోఫీ గా దానికి పేరు పెట్టడం జరిగింది.నిజానికి రిలియన్స్ వాళ్ళు కూడా ట్రోఫీ ని వెండి, బంగారం కలయిక లో తయారు చేయించారు…ఇక ఈ ఇయర్ లో ఆస్ట్రేలియా మొదటి సారి గా వరల్డ్ కప్ ని సొతం చేసుకుంది…

రిలియన్స్ ఇండస్ట్రీస్ ఒక్క సారి కి మాత్రమే వరల్డ్ కప్ స్పాన్సర్స్ గా వ్యవహరించగా, ఆ తర్వాత సంవత్సరం అంటే 1992 వ సంవత్సరం లో రిలయన్స్ వారు స్పాన్సర్స్ గా తప్పుకోవడం తో ఆ ఇయర్ బెన్సన్ అండ్ హెడ్జెస్ అనే బ్రిటిష్ సిగరెట్ కంపెనీ వారు వరల్డ్ కప్ కి స్పాన్సర్స్ గా వ్యవహరించారు.అందుకే ఆ ఇయర్ వరల్డ్ కప్ ని బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ కప్ అని పిలుస్తూ ఉంటారు.ఇక ఈ ఇయర్ పాకిస్థాన్ వరల్డ్ కప్ గెలవడం జరిగింది…

బెన్సన్ అండ్ హెడ్జెస్ కంపెనీ ఐసీసీ తో ఎక్కువ రోజులు తమ స్పాన్సర్ షిప్ ని కొనసాగించలేకపోయింది.దాంతో విల్స్ అనే మరో సిగరెట్ కంపెనీ 1996 వ సంవత్సరం లో వరల్డ్ కప్ కి స్పాన్సర్ గా వ్యవహరించడం జరిగింది…దాంతో ఈ వరల్డ్ కప్ ని విల్స్ వరల్డ్ కప్ 1996 అని పిలిచారు…ఇక ఈ ఇయర్ ఫస్ట్ టైం శ్రీలంక వరల్డ్ కప్ ని దక్కించుకుంది…

ఇక 1996 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం కొత్త స్పాన్సర్స్ వద్దు అనుకొని 1999 వరల్డ్ కప్ కోసం ఐసీసీ నే ఒక వరల్డ్ కప్ ని తయారు చేయడం జరిగింది…ఇక దీనికోసం లండన్ లోని గారార్డ్ అనే ఒక ప్రముఖ జ్యుయలరీ సంస్థ కి ఐసీసీ అప్పగించింది.ఇక దాంతో వాళ్ళు రెండు నెలల సమయం తీసుకొని వరల్డ్ కప్ ని రెడీ చేసారు.60 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్రోఫీ కి పైన బంగారు వర్ణం లో గ్లొబ్ ఉంటుంది.ఇక ఈ గ్లొబ్ కి సపోర్ట్ గా మూడు సిల్వర్ కాలమ్ స్టాంప్స్,బెయిల్స్ ఆకారం లో నిలువ వరుసగా ఉంటాయి.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ని ప్రతిబింభించేలా ఈ ట్రోఫీ ని తయారు చేసారు. ఇక పైన ఉన్న గ్లొబ్ క్రికెట్ బాల్ ని సూచిస్తుంది.ఈ ట్రోఫీ ని ప్రత్యేక కొలమానం తో రూపొందించారు.ఏ కోణం నుంచి చూసిన ట్రోఫీ ఒకే ఆకారం లో ఉంటుంది.ఈ ట్రోఫీ సుమారు 11 కిలోల బరువు ఉంటుంది.

ఇక అంత బాగానే ఉంది కానీ ఈ ట్రోఫీ కి అయ్యే ఖర్చు ఎంత అంటే ఐసీసీ దీనికోసం 40 వేల పౌండ్లు ఖర్చు చేసింది.అంటే ప్రస్తుతం ధరల ప్రకారం 30,85,320 రూపాయలు గా ఉంది.ఇక ఎవరైతే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గెలుస్తారో వాళ్ళకి ఈ ట్రోఫీ ని ఇవ్వడం జరుగుతుంది.ఈ ట్రోఫీ కింద భాగం లో విజేత పేరు ని రాస్తారు.అలాగే ఐసీసీ నిజమైన ట్రోఫీ ని కాకుండా దానిని పోలిన ఇంకో నకలు ట్రోఫీ ని తీసుకు వచ్చి గెలిచినా టీం కి ఇస్తారు ఇక అసలు ట్రోఫీ మాత్రం దుబాయ్ లోని ఐసీసీ కార్యాలయం లో ఉంటుంది. ఇక 1999 లో ఐసీసీ ఏ కప్పు ని అయితే రూపొందించిందో ఇప్పటికి అదే ట్రోఫీ ని గెలిచినా టీం కి ఇవ్వడం జరుగుతుంది…