
Fish Bite : మాంసాహారాల్లో చేపలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే అవి త్వరగా జీర్ణం అవుతాయి. మేక, గొర్రె మాంసం తింటే 72 గంటలు, కోడి మాంసం తింటే 32 గంటలు, అదే చేపలు తింటే 7 గంటల్లో జీర్ణం అవుతాయి. గొర్రె, మేక మాంసాలతో పోలిస్తే చేపలు తొందరగా జీర్ణం అవుతున్నాయి. అందుకే మన కడుపుపై ఎలాంటి ప్రభావం పడదు. దీంతో చాలా మంది చేపలు తినడానికే ఇష్టపడతారు. కానీ చేపలు పట్టడం అందరికి రాదు. కొందరు చూస్తుంటారు. కానీ కొందరు మాత్రం వాటిని దొరకబుచ్చుకోవడంలో పైచేయి సాధిస్తారు.
చేపల వేట అందరికి సాధ్యం కాదు. మ్యాజిక్ తో వాటిని దొరకబడుతుంటారు. అవి కూడా తెలివితో తప్పించుకుంటాయి. కానీ ఇక్కడో విచిత్రం జరిగింది. చేపల వేటకు వెళ్లిన ముగ్గురికి ఓ పెద్ద చేప దొరికింది. అయితే అది తన నోటిని ఒకరి మర్మాంగం దగ్గర కరిచింది. అలాగే పట్టుకుని ఉండటంతో మిగతా ఇద్దరు అతి కష్టం మీద దాన్ని తొలగించారు. అప్పుడు అతడి వేదన చూస్తే పాపం అనిపిస్తుంది. చేప కోసం పాపం పసివాడు అనాలనిపించింది. సహజంగా ఇలాంటి కష్టం ఎవడికి రాకూడదని అనుకుంటాం.
చేపను తొలగించే క్రమంలో అతడు పంచ ప్రాణాలు గాల్లోనే కలిశాయేమో అనిపిస్తుంది. అది ఎంతకీ విడవదు. ఇతడికేమో ప్రాణాలు పోయేంత బాధ. పాపం ఏం చేస్తాం మనం. చూడటమే తప్ప. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు అయ్యో పాపం అనుకోవడమే కానీ ఏం చేయలేం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారి కష్టం దేవుళ్లకే ముట్టాలి అనుకుంటున్నారు. చేప వారిని అంతలా బాధించింటే వారు ఏం పాపం చేశారో అనే కామెంట్లు సైతం వస్తున్నాయి.
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి కాకతాళీయమో కావాలని చేసినవో తెలియకున్నా వారిని గమనిస్తే మనకు వారి మీద జాలి, దయ కలుగుతాయి. సంఘటన స్థలంలో మనం ఉండం కాబట్టి అయ్యో అని నోరెళ్లబెట్టడం తప్ప చేయాల్సింది ఏముండదు. కానీ కొన్ని మనకు చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్నింటిని మనం మరచిపోతాం. ఈ సంఘటన మాత్రం అందరిలో బాధ కలిగించింది. చేప నుంచి అతడిని విడిపించడానికి వారు పడే పాట్లు వర్ణనాతీతం.