Homeఆంధ్రప్రదేశ్‌TTD: హవ్వా.. ఏడుకొండలవాడికి మూడు కోట్ల ఫైనా?.. ఏంటి అన్యాయం?

TTD: హవ్వా.. ఏడుకొండలవాడికి మూడు కోట్ల ఫైనా?.. ఏంటి అన్యాయం?

TTD
TTD

TTD: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడు అని పేరు ఉంది. ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే కోట్లాదిమంది భక్తులు ఇచ్చే విరాళాలపై కేంద్రం టీటీడీ ఆలయానికి జరిమానా విధించడం గమనార్హం. టీటీడీ దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు జరిమానా విధించింది. దీనిపై సామాజిక వేదికల సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఏ) కింద పొందిన లైసెన్స్ గడువు ముగిసిన రెన్యువల్ చేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) కేంద్ర మూడు కోట్ల భారీ జరిమానా విధించింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా శ్రీవారికి విదేశీ భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ. 30 కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాకుండా ఎస్బిఐ వద్ద మూలుగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ కూడా వేస్తుంటారు. గతంలో ఆ విదేశీ నగదును ఆర్బిఐ ద్వారా టిటిడి మన కరెన్సీలోకి మార్చుకునేది.

లైసెన్సు గడువు ముగియడంతో సమస్య..

కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్సిఆర్ఎ చట్టం కింద టీటీడీ లైసెన్సు తీసుకుంది. 2018లో దాని కాల పరిమిత ముగిసింది. టిటిడి యంత్రాంగం లైసెన్స్ పునరుద్ధరణను పట్టించుకోలేదు. ఎఫ్సిఆర్ఏ విభాగం 2019లో దీనిని గుర్తించింది. లైసెన్సు లేకపోయినా టిటిడి విదేశీ విరాళాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్లు జరిమానా విధించింది. అప్పటి నుంచి విదేశీ కరెన్సీ మారకానికి ఆర్బిఐ అంగీకరించడం లేదు.

రూ.30 కోట్లు ఆర్బీఐ వద్ద పెండింగ్..

విదేశీ మార్గానికి ఆర్బిఐ అంగీకరించకపోవడం వలన 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టిటిడి ఖాతాలో జమ కాకుండా ఎస్బిఐ మూలుగుతోంది. టీటీడీ ఆలస్యంగా అందజేసిన ఆదాయ వివరాలను కూడా సక్రమ ఫార్మాట్లో ఇవ్వలేదంటూ కేంద్రం తాజాగా మరో రూ.3.19 కోట్లు జరిమానా విధించింది. దీంతో జరిమానా మొత్తం 4.33 కోట్లకు చేరుకుంది. కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ ట్వేట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే కేంద్రం విధించిన మూడు కోట్ల జరిమానా చెల్లించామని టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోమవారం తిరుమలలో మీడియాకు తెలిపారు.

TTD
TTD

సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు..

ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వారి పరిస్థితి ఏమైందో, ఇప్పుడు జరిమానా విధించిన వారి పరిస్థితి అదే అవుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ప్రముఖ దేవస్థానంగా వెలుగొందుతున్న టీటీడీకి జరిమానా విధించడం హాస్యాస్పదంగా ఉందంటూ పలువురు పేర్కొంటున్నారు. హిందూమత ఉద్దారకులుగా చెప్పుకునే బిజెపి నాయకులకు ఇది కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version