School Fee: విద్యాదానం గొప్పదానం అంటారు పెద్దలు. కానీ విద్య నేటి రోజుల్లో మంచి బిజినెస్‌గా మారింది. దీంతో చదువుకునే రోజులు పోతున్నాయి.. చదువు కొనే రోజులు వస్తున్నాయి. ఒకవైపు పాలకులు, లక్షల్లో ప్రజాధనాన్ని వేతనాలుగా తీసుకుంటున్న ఉపాధ్యాయుల తీరు కారణంగా ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడుతుఆన్నయి. ప్రైవేటు విద్యా సంస్థలు గల్లీకి ఒకటి పుట్టుకొస్తున్నాయి. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పే చదువులనే బోధిస్తున్నాయి. ఇక తల్లిదండ్రులు కూడా ప్రైవేటు, కార్పొరేట్ చదువులనే ఇష్టపడుతున్నారు. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడాన్ని ప్రెస్టీజ్‌గా తీసుకుంటున్నారు. ఎంత ఎక్కువ ఫీజు ఉన్న పాఠశాలకు పంపితే తమ స్టేటస్ అంత ఎక్కువ అన్న భావనలో ఉన్నారు. దీంతో కార్పొరేట్ విద్యా వ్యాపారం విరాజిల్లుతోంది. మధ్య తరగతి వారికి ప్రైవేటు విద్య అందని ద్రాక్షగా మారుతోంది. ఫీజు నియంత్రణ చట్టం తెచ్చామని పాలకులు చెబుతున్నా.. అములలో నిర్లక్ష్యంతో ప్రైవేటు విద్యా సంస్థల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ విద్యార్థి తండ్రి ప్రైవేటు ఫీజు దోపిడీపై సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. తన కూతురును చేర్పించాలనుకుంటున్న పాఠశాలలో ఒకటో తరగతి ఫీజే రూ.4.27 లక్షలని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
అందని ద్రాక్షలా ప్రైవేటు విద్య..
ప్రైవేటు చదువులు మధ్య తరగతికి అందని దాక్షలా మారిందని ఓ తండ్రి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన కూతురును చేర్పించే పాఠశాలలో ఒకటో తరగతి ఫీజు రూ.4.27 లక్షలని పేర్కొన్నాడు. జైపూర్‌కు చెందిన రిషబ్ జైన్ భారీ స్కూల్ ఫీజు గురించి సోషల్ మీడియాలో పోస్టు ద్వారా చాలా మందికి తెలియజేశాడు. ఒకటో తరగతికి రానున్న తన కూతురు గురించి చెప్పుకొచ్చాడు.. చిన్నారి కోసం ఓ స్కూల యాజమాన్యాన్ని సంప్రదించగా అక్కడ ఫీజు రూ.4.,27 లక్షలని పేర్కొన్నట్లు తెలిపాడు. మన దేశంలో మిడిల్ క్లాస వారికి నాణ్యమైన విద్య ఓ లగ్జరీగా మారింది. ఇతర స్కూళ్లలో కూడా ఇదే స్థాయిలో ఫీజులు ఉన్నాయి. ఒకటో తరగతి చేర్పించేందకు రిజిస్ట్రే›్షన్ ఫీజు రూ.2 వేలు అంట. ఇక అడ్మిషన్ ఫీజు రూ.40 వేలు అని, రిఫండబుల్ ఫీజు రూ.5 వేలు అని పేర్కొన్నాడు. వార్షిక ఫీజు రూ.5.52 లక్షలు, బస్ ఫీజు రూ.1.08 లక్షలని వెల్లడించాడు. యూనిఫామ్‌కు రూ.20 వేలు, మొత్తం కలిపితే రూ.4.27 లక్షలు’ అని వివరించాడు.
ఏటా రూ.20 లక్షలు సంపాదించినా..
ఏటా రూ.20 లక్షల ఆదాయం ఉన్నవారు కూడా ఈ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు వెనకాడుతున్నారని పేర్కొన్నాడు. జీతంలో 50 వాతం ఆదాయాన్ని, పన్ను, జీఎస్‌టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాండ్ రిజిస్ట్రేషన్ చార్జీలు తదితరాలు ప్రభుత్వం లాక్కుటుందని వెల్లడించాడు. ఇక జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రీమియంలో, పీఎఫ్, ఎన్‌పీఎస్ వంటివి మనమే కట్టుకోవాలని తెలిపాడు. ఇక రూ.20 లక్షల వార్షిక ఆదాయం ఉంటే.. ఐటీ 30 శాతం చెల్లించాలి అని వెల్లడించాడు.
సోషల్ మీడియాలో వైరల్..
రిషబ్ జైన్ చేసిన ఈ పోస్టు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పోస్టును చూసిన నెటిజన్లు, పేరెంట్స్ రిషబ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఇంత డబ్బు వెచ్చించినా నాణ్యమైన విద్య దొరుకుతుందన్న గ్యారెంటీ లేదని పేర్కొంటున్నారు. చదువు చెప్పడం కన్నా లగ్జరీకే పిల్లలను అలవాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్ష రహిత సంస్థలుగా ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతున్న విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి మాత్రం డబ్బులు దండుకుంటున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
Good education is a luxury – which middle class can not afford
My daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.
– Registration Charges: ₹2,000
-… pic.twitter.com/TvLql7mhOZ— RJ – Rishabh Jain (@rishsamjain) November 17, 2024