https://oktelugu.com/

Home Loan: తీసుకునేవారికి అలర్ట్.. ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర నష్టం..

ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. ఒకప్పుడు జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఇల్లు నిర్మించుకునేవారు. దీంతో ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ ఇంట్లో అనుభవించే అవకాశం ఉండేది కాదు. కానీ నేటి కాలంలో బ్యాంకులు రుణాలు ఏర్పాటు చేయడంతో చాలా మంది బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 19, 2024 / 04:39 PM IST

    Alert-for-borrowers

    Follow us on

    Home Loan: ఇల్లు కట్టుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. ఒకప్పుడు జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఇల్లు నిర్మించుకునేవారు. దీంతో ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ ఇంట్లో అనుభవించే అవకాశం ఉండేది కాదు. కానీ నేటి కాలంలో బ్యాంకులు రుణాలు ఏర్పాటు చేయడంతో చాలా మంది బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకుంటున్నారు. మిగతా రుణాల కంటే ఇంటి నిర్మాణం కోసం తీసుకునే లోన్ పై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. దీంతో వ్యాపారులు సైతం హోమ లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకుంటున్నారు. అయితే చాలా మంది బ్యాంకు లోన్ తీసుకునే సమయంలో కొన్ని మిస్టేక్ చేయడం వల్ల భారీగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో అలర్ట్ గా ఉండడం వల్ల చాలా వరకు నష్ట నివారణ చేసుకోవచ్చు. ఆ 5 విషయాలు ఏవంటే?

    బ్యాంకు లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వడ్డీ రేట్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఫిక్స్ డ్ వడ్డీ రేటు.మరొకటి ఫ్లోటింగ్ వడ్డీ రేటు. ఇందులో మొదటిది ఒకసారి వడ్డీ రేటు నిర్ణయించిన తరువాత ఇదే మొత్తం లోన్ పూర్తయ్యే వరకు ఉంటుంది. మరొకరి ఫ్లోటింగ్ వడ్డీ రేటు. ఇది భవిష్యత్ లో వడ్డీ రేట్లు మారడం వల్ల తగ్గొచ్చు.. లేదా పెరుగొచ్చు. ఈ రెండింటిలో ఏది కన్వినెంట్ గా ఉంటుందో చూసుకొని వారితో ఏదో ఒకదానికి మాత్రమే ఓకే చెప్పాలి.

    ఉద్యోగుల ఇల్లు నిర్మాణం కోసం కచ్చితంగా బ్యాంకు లోన్ తీసుకుంటారు. ఎందుకంటే వీరికి నెలనెలా కొంత మొత్తం వస్తుంది. దీనిని ఈఎంఐ రూపంలో చెల్లించాలని అనుకుంటారు. అయితే ఈ ఈఎంఐలు 5 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. అయితే ఎక్కువ కాలం టెన్యూర్ ఉంచడం వల్ల వడ్డీ రేటు ఎక్కువగా పడుతుంది. దీంతో లోన్ త్వరగా పూర్తి కాదు. అందువల్ల ఈఎంఐని ఎక్కువగా నిర్ణయించుకొని తక్కవ వ్యవధిలోనే లోన్ పూర్తి చేసుకోవాలి.

    కొన్ని బ్యాంకులు జీరో ప్రాసెసింగ్ ఫీజుతో బ్యాంకు లోన్ ఇస్తామని అంటారు. అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వివిధ రకాలుగా ఉంటుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ముందుగా ఏదో ఒక రూపంలో డబ్బు వసూలు చేస్తారు. ఆ తరువాత రిఫండబుల్ అని చెబుతారు. కానీ కొన్ని బ్యాంకులు ఇలా చెప్పి మోసం చేస్తాయి. ఈ జీరో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా మిగతా వాటి విషయంలో తగ్గింపు ఉంటే వాటిపై దృష్టి పెట్టాలి.

    బ్యాంకు లోన్ తీసుకున్న తరువాత ఎటువంటి నిర్లక్ష్యానికి పాల్పొడద్దు. ఏ ఒక్క ఈఎంఐ గడవు తేదీలో చెల్లించకపోయినా క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. దీంతో భవిష్యత్ లో మరో లోన్ తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. అంతేకాకుండా రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లించడం ద్వారా కొన్ని ఆఫర్లు వస్తుంటాయి.

    లోన్ తీసుకున్న తరువాత పూర్తి కాలం చెల్లించడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వివిధ మార్గాల నుంచి డబ్బు వస్తే లోన్ ముందస్తుగా చెల్లింపు చేసేందుకు ప్రయత్నించాలి. ఇలా చెల్లించడం ద్వారా వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. అయితే కొన్ని బ్యాంకులు వడ్డీ మాఫీ చేయలేవు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వడ్డీ మాఫీ లేదంటే ముందస్తు చెల్లింపులు చేయకుండా ఉంటేనే మంచిది.