https://oktelugu.com/

Ukraine Russia War: ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం.. వెయ్యి రోజులైనా ముగియని వార్‌.. 21వ శతాబ్దంలోనే దారుణమైన పోరు ఇదే!

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించి వెయ్యి రోజులైంది. తర్వాత ఉక్రెయిన్‌ కూడా ప్రతిదాడి మొదలు పెట్టింది. ఇప్పటికీ వార్‌ కొనసాగుతూనే ఉంది.

Written By: Raj Shekar, Updated On : November 19, 2024 4:17 pm
Ukraine Russia War

Ukraine Russia War

Follow us on

Ukraine Russia War: యూరప్‌లో మొదలైన రష్యా–ఉ‘కెయిన్‌ వార్‌.. రెండుడన్నరేళ్లుగా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ను తన దారికి తెచ్చుకోవలని రష్యా యత్నిస్తుంటే.. అమెరికాతోపాటు నాటో దేశాల సహకారంతో ఉక్రెయిన్‌ రష్యాపై తిరగబడింది. దీంతో నెల రెండు నెల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం.. రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. అత్యంత భీకరమైన ఈ యుద్ధం మొదలై మంగళవారం(నవంబర్‌ 19)నాటికి 1000వ రోజుకు చేరింది. 21వ శతాబ్దంలోనే అతి దారుణమైన పోరుగా రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ నిలిచింది. 2022, ఫిబ్రవరి 24న మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టాయి. ఈ వార్‌తో ఉక్రెయిన్‌లోని కీవ్‌ నగరం పూర్తిగా ధ్వంసమైంది. పరస్పర దాడులతో ఇరు దేశాలకు చెందిన వందల మంది ప్రాణాలు కల్పోయారు. లక్షల మంది క్షతగాత్రులయ్యారు. ఉక్రెయిన్‌లో చాలా నగరాలు ధ్వంసమయ్యాయి. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి.

యుద్ధం మిగిల్చిన విషాదాలివీ..
– వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ సైనికులు 80 వేల మంది మరణించారు. 4 లక్షల మంది గాయపడ్డారు.

– ఇక రష్యావైపు కూడా నష్టం జరిగినా ఎంత మంది మరణించారు.. ఎంత మంది క్షతగాత్రులయ్యారనే వివరాలు అధికారికంగా వెల్లడించడం లేదు. పశ్చిమాసియా దేశాల నిఘా ప్రకారం.. ఇప్పటి వరకు 2 లక్షల మంది మాస్కో సైనికులు ప్రాణాలో కోల్పోయారు. మరో 4 లక్షల మంది గాయపడ్డారు.

– మానవ హక్కులక కమిషన్‌ లెక్కల ప్రకారం.. ఉక్రెయిన్‌లో 2024, ఆగస్టు 31 నాటికి కీవ్‌ వైపు కనీసం 11,743 మంది సామాన్యులు యుద్ధంతో ప్రాణాలు కోల్పోయారు. 24,600 మంది గాయపడ్డారు. పౌరుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలు రష్యా అధీనంలో ఉండడంతో అక్కడి బాధితులను గుర్తించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ఇక 2024, నవంబర్‌ 14 నాటికి 589 మంది ఉక్రెయిన్‌ చిన్నారులు మరణించారు.

– యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు గణనీయంగా పడిపోతోంది. రెండున్నరేల్ల క్రితం ఉన్న జననాల రేటుతో పోలిస్తే ప్రస్తుతం మూడో వంతు పడిపోయింది. ఇక ఉక్రెయిన్‌లో 40 లక్షల మంది పౌరులు ఉన్న ఊరిని వదిలి పోయారు. 60 లక్షల మంది ప్రాణ భయంతో దేశాన్ని విడిచి శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లారు.

– సుదీర్ఘ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో 2023 డిసెంబర్‌ నాటికే 152 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగినట్లు తెలిపింది. దేవంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంకు, ఐరోపా కమిషన్, ఐక్యరాజ్య సమితి అంచనా వేశాయి.

– ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి, పునరుద్ధరణకు సుమారుగా 486 బిలియన్‌ డాలర్లు అవసమని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్‌ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లోనే అంచనా వేసింది. ఇది కీవ్‌ సాధారణ జీడీపికన్నా మూడు రెట్లు ఎక్కువ. రక్షణ రంగం కోసం 53.3 బిలియన్‌ డాలర్లు అవసరమని 2025 బడ్జెట్‌ అంచనాల్లో ఉక్రెయిన్‌ తెలిపింది.

– రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు పశ్చిమాసియా దేశాలు భారీగా సైనిక, ఆర్థికసాయం అందించాయి. ఇప్పటి వరకు కీవ్‌ 100 బిలియన్‌ డాలర్లకుపైగా సాయం అందుకున్నట్లు అంతర్జాతీయ మీడియా అంచనా వేసింది.