Kabosu Dog: ‘డోజ్ మీమ్’, ‘డోజ్ కాయిన్’ ఫేమ్ ‘షిబా ఇను కబోసు’ కుక్క కన్నుమూత

తమ నివాస ప్రాంతం నరిటా సిటీలోని కొట్సు నో మోరిలోని ఫ్లవర్ కౌరీలో కబోసు కోసం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతిమ వీడ్చోలు ఏర్పాటు చేసినట్లు అట్సుకో తెలిపారు.

Written By: Neelambaram, Updated On : May 25, 2024 3:47 pm

Kabosu Dog

Follow us on

Kabosu Dog: పెంపుడు కుక్కలు చేసే కొన్ని పనులు యజమానులకు ఆనందంతో పాటు కోట్లాది రూపాయలు తెచ్చిపెడతాయి. పైగా ప్రపంచ వ్యాప్తంగా తమతో పాటు తమ యజమానిని కూడా ఫేమస్ చేస్తాయి. అలాంటి కుక్కనే ‘షిబా ఇను కబోసు’. ఇది జపనీస్ కు చెందింది. కబోసు యజమాని అట్సుకో సాటో తన బ్లాగ్ ద్వారా ఈ విషయాన్ని వెళ్లడించింది. ‘నేను కబోసును లాలిస్తుండగానే నిద్రపోతున్నట్లుగా నిశ్శబ్దంగా కన్నుమూసింది.’ అని ఆమె తెలిపింది. తన డాగ్ ను ఇష్టపడిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ పేర్కొంది.

తమ నివాస ప్రాంతం నరిటా సిటీలోని కొట్సు నో మోరిలోని ఫ్లవర్ కౌరీలో కబోసు కోసం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంతిమ వీడ్చోలు ఏర్పాటు చేసినట్లు అట్సుకో తెలిపారు.

అట్సుకో సాటో అనే జపనీస్ కిండర్ గార్డెన్ టీచర్ ఫిబ్రవరి 13, 2010న తన వ్యక్తి గత బ్లాగ్‌లో తను దత్తత తీసుకున్న షిబా ఇను కబోసు చిత్రాలను షేర్ చేసింది. కబోసు మంచంపై పడుకొని కెమెరా వైపు చూస్తున్న ఒక విచిత్రమైన చిత్రం అందులో కబోసు కనుబొమ్మలను పైకి ఎత్తి ఉన్న ఫొటో వైరల్ అయ్యింది.

జూన్ 24, 2005 నాటి హోమ్‌స్టార్ రన్నర్ కార్యక్రమంలో కబోసును ‘డోగే’ అని పిలిచారు. టెక్ న్యూస్ వెబ్‌సైట్ ది వెర్జ్ డిసెంబర్ 2013లో ఒక కథనాన్ని విడుదల చేసింది. ‘డోగే’ జనాధారణ పొందిన కొద్దిసేపటికే, సాటో కబోసును మీమ్‌లో చూపిన అసలు షిబా ఇనుగా గుర్తిస్తుంది. కబోసుతో పాటు, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఫోటోగ్రాఫర్ జోనాథన్ ఫ్లెమింగ్ పెంపుడు జంతువు అయిన షిబా ఇను ‘సుకి’ని ది వెర్జ్ గుర్తించింది.

డిసెంబర్ 2013 లో, ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కబోసు చిత్రంను క్రిప్టోకరెన్సీ డోజ్ కాయిన్ పై ముద్రించారు. ఇప్పుడు బిలియనీర్ ఎలాన్ మస్క్ తో సహా ప్రపంచంలోని టాప్ 10 అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ్ల్లో ఒకటిగా నిలిచింది.