Tollywood Secrets : టాలీవుడ్ కథలు : ఆ హీరోయిన్ కోసం కొత్త కారు.. దర్శకుడి ప్రేమ ఖరీదు ఇదీ

Tollywood Secrets : బాగా రాసేవారు.. బాగా మాట్లాడేవారు ఉత్తములు అనుకుంటే పొరపాటే. అసలు సినీ ఇండస్ట్రీలో కమిట్ మెంట్ కామన్. అది హీరోయిన్లు అలవరుచుకుంటేనే పదికాలాల పాటు కొనసాగుతారని ఓ బ్యాడ్ రూమర్ టాలీవుడ్ లో ఉంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు తమను రెగ్యులర్ గా సినిమాల్లో తీసుకోవాలని దర్శక నిర్మాతలకు, హీరోలకు కమిట్ మెంట్ ప్రకారం సర్వం అర్పించుకుంటారని ఓ గాసిప్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఓ బాగా […]

Written By: NARESH, Updated On : February 23, 2023 7:21 pm
Follow us on

Tollywood Secrets : బాగా రాసేవారు.. బాగా మాట్లాడేవారు ఉత్తములు అనుకుంటే పొరపాటే. అసలు సినీ ఇండస్ట్రీలో కమిట్ మెంట్ కామన్. అది హీరోయిన్లు అలవరుచుకుంటేనే పదికాలాల పాటు కొనసాగుతారని ఓ బ్యాడ్ రూమర్ టాలీవుడ్ లో ఉంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు తమను రెగ్యులర్ గా సినిమాల్లో తీసుకోవాలని దర్శక నిర్మాతలకు, హీరోలకు కమిట్ మెంట్ ప్రకారం సర్వం అర్పించుకుంటారని ఓ గాసిప్ ఎప్పటి నుంచో ఉంది.

అయితే ఓ బాగా టాలెంట్ ఉన్న దర్శకుడు వేదికలపై అత్యద్భుతంగా ప్రసగింస్తాడు. అతడి మాటల ప్రవాహానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇక ఆయన సినిమాల్లో డైలాగులకు చాలా ఫేమస్. మంచి పదాలతో కట్టిపడేసే అర్థాలతో డైలాగులు రాయడంలోనూ దిట్ట.

అయితే అన్నీ బాగానే ఉన్న ఆ రచయిత కం దర్శకుడికి ఓ పాడు బుద్ది ఉందని ఇండస్ట్రీలో గుసగుస ఉంది. తన సినిమాలో ఒకే హీరోయిన్ ను వరుసగా రిపీట్ చేస్తాడు. హీరోలు ఆమె ఫేడ్ అవుట్ అయిపోయిందని అన్నా సరే.. ఆమెనే కావాలని పట్టుబడుతాడు. పెళ్లయ్యి వరకూ ఒక హీరోయిన్ కు వరుసగా ఛాన్స్ ఇచ్చిన ఈ దర్శకుడు ఆ తర్వాత ఇప్పుడు మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు వరుసగా అవకాశాలిస్తున్నాడు..

ఇటీవల ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రానికి ఆ హీరోయిన్ అందుబాటులో లేకున్నా సరే ఆమె కోసం షూటింగ్ వాయిదా వేసి మరీ ఆమెనే పెట్టుకున్నాడట.. ఆ హీరో వద్దంటున్నా ఆమెనే కావాలని పట్టుబట్టాడట.. తాజాగా ఈ భామ హైదరాబాద్ లో దిగగానే ఆమె కోసం రెంట్ కారు కంటే సొంత కారు బెటర్ అని ఏకంగా ఒక కొత్త కారు ఆమె కోసం ప్రత్యేకంగా పెట్టాడట.. అఫ్ కోర్స్ అవి ఆయన జేబులోంచి ఇచ్చిన డబ్బులు కావు. నిర్మాత డబ్బులే. ఆమెతో ఆ దర్శకుడి అనుబంధం ఏ స్థాయిలో ఉందో ఈ కొత్త కారు కొని ఆమె కోసం పెట్టినప్పుడే అర్థమైందట.. ఆ దర్శకుడికి ఆ హీరోయిన్ ప్రేమ చూసి ఇప్పుడు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అదీ కథ..