https://oktelugu.com/

Andhra Pradesh History : ఆంధ్రప్రదేశ్ కు అన్ని ఖండాలతో భౌగోళిక సంబంధాలు ఉన్నాయా? శాస్త్రవేత్తల పరిశీలనలో సంచలన నిజాలు వెలుగులోకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలు పురాతన ఆనవాళ్ళ ఆధారంగా మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగాల ద్వారా సరికొత్త విషయాలను వెల్లడించనున్నారు.. వీటివల్ల ఒకప్పటి విషయాలు ప్రస్తుత తరానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఔత్సాహిక యువత వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2024 / 10:41 PM IST
    Follow us on

    Andhra Pradesh History : ఇటీవల చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లో శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తుండగా.. ఒక కప్ప కనిపించింది. ఆ కప్ప శ్రీలంకలో మాత్రమే కనిపిస్తుంది. నీటి వనరులు విస్తారంగా ఉండే ప్రాంతాలలో మాత్రమే ఆ కప్ప జీవిస్తుంది. అయితే ఆ కప్ప ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. గతంలో శ్రీలంక కూడా భారతదేశంలో ఒక భూభాగంగా ఉండేదని.. నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాలకు సరిహద్దుగా ఉండేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.. అందుకే ఆ కప్ప శేషాచలం కొండల్లో కనిపిస్తోందని వివరించారు. ఈ విషయాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ లోని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్సి ట్యూట్ శాస్త్రవేత్తల బృందం మరో సంచలన విషయాన్ని వెల్లడించింది.

    వెలుగులోకి సంచలన అంశాలు..

    హైదరాబాద్ లోని నేషనల్ జియో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ కే చంద్రకళ, ఓపీ పాండే, బిశ్వజిత్ మండల్, ప్రేమ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దర్శి, అద్దంకి ప్రాంతాలలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతాలలో ఒక రహస్య పర్వతాన్ని వెలికి తీసింది. ఈ పర్వతం. కడప జిల్లాకు దక్షిణం వైపు వంగి ఉంది. ఇది కొలంబియా- రోడ్నియా ప్రాంతాల్లోని సముద్రపు ఉపరితలాన్ని సూచిస్తోందట. ఈ శాస్త్రవేత్తల బృందం ఉత్తర కడప బీసీల్లోని ఉప ఉపరితలం లోని క్రిస్టల్ సీస్మిక్ నిర్మాణాన్ని పరిశోధించింది. గోండ్వానా అవక్షేపాల ద్వారా ఏర్పడిన ఒండ్రు మట్టిలోనే పలుచని పొరనూ పరిశీలించింది. అయితే ఈ ప్రాంతంలోని నేల ప్రస్తుత దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అరేబియా, మడగాస్కర్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారతదేశంలో కూడి ఉన్న సూపర్ ఖండమట. భౌగోళిక పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతాల మొత్తం విడిపోయాయి.  ఒక బిలియన్ సంవత్సరాల క్రితం భారత్ – తూర్పు అంటార్కిటికా ప్రాంతాలు కలిసి ఉండేవట. ఆ తర్వాతి పరిణామక్రమాల తర్వాత అవన్నీ వేరయ్యాయి.

    శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

    గత కొన్ని రోజులుగా ఏపీలో పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు.. తమ అధ్యయనంలో వెళ్లడైన విషయాలను పంచుకుంటున్నారు..”మేము పరిశీలిస్తున్న ప్రాంతాలలో విస్తృతమైన ప్రోటె రోజోయిక్ అవక్షేపణ కనిపించింది. స్పటికాకార నేల మాలికలో నేరుగా ఎగువ, దిగువ ప్రోటె రోజుయిక్ కడప అవక్షేపాలను మేము గుర్తించాం. ఇది ప్రొటె రోజోయిక్ యుగంలో భారతదేశం తూర్పు తీరం భౌగోళిక చరిత్రలో సరికొత్త విషయాలను వెల్లడించిందని” శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    జర్నల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ జియో ఫిజిక్స్ లో..

    శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం తాలూకు విషయాలను జర్నల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ జియో ఫిజిక్స్ లో ప్రచురించారు. భారత ఉపఖండం గురించి.. గతంలో చోటు చేసుకున్న మార్పుల గురించి రూపొందించిన పురాతన భౌగోళిక సంఘటనలను, అంటార్కిటికాతో ఉన్న సంబంధాలను ఈ పుస్తకంలో ప్రచురించారు. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో భారత ఉపఖండంలో కీలక ప్రాంతంగా ఉండేది. భారతదేశం కూడా విస్తృతమైన పరిధిని కలిగి ఉండేది. ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు సంభవించి కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. పాత ప్రాంతాలు ఇతర రూపును సంతరించుకున్నాయి. ఆయనప్పటికీ అక్కడక్కడ కొన్ని ఆనవాళ్లు.. శాస్త్రవేత్తలు వాటి ఆధారంగా చేసిన పరిశీలనలు.. పురాతన విషయాలను సరికొత్తగా వెల్లడిస్తున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పలు పురాతన ఆనవాళ్ళ ఆధారంగా మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగాల ద్వారా సరికొత్త విషయాలను వెల్లడించనున్నారు.. వీటివల్ల ఒకప్పటి విషయాలు ప్రస్తుత తరానికి తెలిసే అవకాశం ఉంటుంది. ఔత్సాహిక యువత వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఆస్కారం ఉంటుంది.