
Kalyani Priyadarshan: టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ సినిమాల్లో అవకాశం వస్తుందంటారు. కానీ అదృష్టం కూడా తోడవ్వాలని కొందరిని చూస్తే అర్థమవుతుంది. సినిమాల్లోకి రావడానికి కొందరికి బ్యాగ్రౌండ్ ఉన్నా రాణించలేరు. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో కొందరు తట్టుకోలేకపోతున్నారు. అయినా ఏదోలా సినిమా ఎంట్రీ ఇచ్చినా కొన్ని సినిమాల్లో అలరించి ఆ తరువాత కనిపించకుండా పోతున్నారు. నేటి కాలంలో ఇండస్ట్రీకి ఎంతో మంది భామలు వచ్చారు. కానీ వేళ్లమీద లెక్కపెట్టే వారు మాత్రమే కొనసాగుతున్నారు.
అందం, అభినయం ఉన్నా అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే ఇతర ఇండస్ట్రీల్లో మాత్రం బెస్ట్ యాక్టర్ అనిపించుకుంటున్నారు. లేటెస్టుగా ఓ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈమె ఇప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. కానీ అదృష్టం ఆమె ఇంటి తలుపు తట్టలేదని తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?
పై ఫొటోలో ఉన్న వారిలో అందరి కంటే పెద్దాయన గురించి అడిగితే ఇప్పటి వారు గుర్తుపట్టరు కావచ్చు. కానీ నాటి సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. ఆయన పేరు ప్రియదర్శన్. ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పక్కన సర్కిల్ లో ఉన్న ముద్దుగుమ్మను చూశారా? ఆమె ఇప్పుడు హీరోయిన్. ఆమె పేరు కళ్యాణి ప్రియదర్శన్.

అక్కినేని అఖిల్ పలు చిత్రాల్లో నటించారు. ‘హలో’ అనే మూవీలో అఖిల్ కు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ నటించారు. ఆ తరువాత చిత్రలహరి, రణరంగం తదితర చిత్రాల్లో నటించింది. అయితే తెలుగులో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడంతో తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తెలుగులో మాత్రం రాణించలేకపోతుంది. అమ్మడుకు సినీ బ్యాక్రౌండ్ ఉన్నా అదృష్టం లేకపోవడంతో అవకాశాలు రావడం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే అందం, అభినయంతో కళ్యాణి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఆమె ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉంటూ తన ఫర్ఫామెన్స్ ను చూపిస్తోంది. అయితే కళ్యాణి ఎక్కడా గ్లామర్ షో చేసినట్లు కనిపించడం లేదు. సాంప్రదాయబద్ధంగా కనిపించే ఈమె తన నటనతో మాత్రం అభిమానులను విపరీతంగా పెంచుకుంది. నటించింది కొన్ని సినిమాలే అయినా ఆమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు.