
Maneka Suresh: హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ తరచుగా ఎఫైర్ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమెకు పలువురు ప్రముఖులతో లింకప్ చేస్తూ కథనాలు వెలువడ్డాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ తో కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారంటూ ఓ వార్త వచ్చింది. ఇద్దరూ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడంతో సంథింగ్ సంథింగ్ అంటూ కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలు సద్దుమణిగిన కొన్ని రోజులకు కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఆమె ఎఫైర్ పెట్టుకున్నారని పుకార్లు లేచాయి. పెళ్ళైన విజయ్ కి ఆమె దగ్గరయ్యారని, కీర్తి కారణంగా భార్యతో విజయ్ కి గొడవలు అయ్యాయన్నారు. విడాకుల వరకు వ్యవహారం వెళ్ళిందంటూ గుసగుసలు వినిపించాయి.
ఇవన్నీ కాదు… కీర్తి తన క్లాస్ మేట్ తో లవ్ లో ఉంది. వీరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆయన రిసార్ట్స్ ఓనర్. సదరు వ్యాపారవేత్తతో లవ్ ఎఫైర్ గురించి కీర్తి సురేష్ పేరెంట్స్ కి కూడా తెలుసు. త్వరలో పెళ్లి ప్రకటన వస్తుంది… అంటూ వార్తలు వినిపించాయి. ఎన్ని పుకార్లు వచ్చినా కీర్తి సురేష్ నోరు విప్పలేదు. ఇవన్నీ కామనే అన్నట్లు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కీర్తిపై వస్తున్న ఎఫైర్ వార్తల మీద తల్లి మేనక స్పందించారు. ఆమె ఇవన్నీ నిరాధార కధనాలని కొట్టిపారేశారు.
కీర్తి సురేష్ ఎవరినీ ప్రేమించలేదు. తాను నటిగా బిజీగా ఉంది. కీర్తి ఎవరినైనా ప్రేమిస్తే మాకు ఖచ్చితంగా చెబుతుంది. అప్పుడు మీడియాకు సమాచారం ఇస్తాము. కీర్తి సురేష్ మీద ఇలా పుకార్లు వస్తున్నాయంటే ఆమె మరింత ఎదిగారని అర్థం, అని మేనక స్పష్టత ఇచ్చారు. కాగా 80-90లలో మేనక సురేష్ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయారు. మలయాళ, తమిళ చిత్రాల్లో అధికంగా మేనక చిత్రాలు చేశారు. తెలుగులో పున్నమి నాగు చిత్రంలో నటించారు.

మేనక దర్శకుడు సురేష్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయికి వివాహమైంది. ఆమె పరిశ్రమకు రాలేదు. చిన్నమ్మాయి కీర్తి తల్లి వారసత్వం తీసుకుని స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆమె లేటెస్ట్ మూవీ దసరా మార్చి 30న విడుదలైంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ మూవీలో చెల్లి పాత్ర చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది. కీర్తి చేతిలో అరడజను చిత్రాల వరకు ఉన్నాయి.