Homeట్రెండింగ్ న్యూస్Milestones: రోడ్ల మీద ఉండే మైలురాళ్లకు రంగులు.. ఏ రంగు దేనికి సంకేతం!

Milestones: రోడ్ల మీద ఉండే మైలురాళ్లకు రంగులు.. ఏ రంగు దేనికి సంకేతం!

Milestones: సాధారణంగా మనం రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు మైలురాళ్లు కనిపిస్తాయి. వాటిపై గమ్యం ఎంత దూరం ఉందో తెలియజేసే రాతలు కనిపిస్తాయి. వాటిని చూసి మనం మన చేరుకోవాల్సిన దూరం ఎంత ఉందో నిర్ణయిస్తాం. అయితే ఈ రాళ్లపై రంగులు కూడా ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో రంగు వేసి ఉంటుంది. అయితే ఈ రంగులను మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఈ రంగుల వెనుక చాలా కథ ఉంది. కానీ మనం ఈ రంగులకు అర్థం ఏంటి అని మాత్రం ఆలోచించం. ఏ రంగు దేనిని సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రంగులు.. వారి అర్థాలు..
మైలు రాళ్లపై రెండు రంగులు ఉంటాయి. సగం వరకు తెలుపు రంగు ఉన్నప్పటికీ పైన మాత్రం రంగులు మారుతుంటాయి.

– కింది భాగం తెలుపు, పై భాగం పసుపు రంగులో ఉంటే.. మనం హైవేమీద ప్రయాణిస్తున్నట్లు అర్థం. దానిపై నేషనల్‌ హైవే నంబర్‌ కూడా ఉంటుంది.

– ఇక పైభాగంలో ఆకుపచ్చరంగు రాళ్లు కూడా కనిపిస్తాయి. ఇలా ఉంటే అది రాష్ట్ర రహదారి అని అర్థం. గ్రీన్‌ రంగులో రాష్ట్ర రహదారి నంబర్‌ కూడా ఉంటుంది.

– ఇక మనం ప్రయాణించే రోడ్డు పక్కన ఉన్న మైలురాయి పైన బ్లూ కలర్‌ లేదా బ్లాక్‌ లేదా వైట్‌ కలర్‌ ఉంటే.. అవి జిల్లా రహదారులు, సిటీలోకి ఎంటర్‌ అయ్యే రహదారులు అని అర్థం. అంటే మనం పట్టణాలకు దగ్గరగా ఉన్నామని అర్థం.

– ఇక మైలురాయిపై ఎరుపురంగు ఉంటే.. ఆ రహదారి గ్రామీణ రహదారి అని గుర్తించాలి.

– పూర్తిగా ఆకుపర్చ రంగు ఉంటే.. మనం అడవిలో ఉన్నట్లుగా గుర్తించాలి.

ఇలా మైలురాళ్ల రంగులు వాటిపై గమ్యస్థానం దూరం తెలుపడంతోపాటు అవి ఏ రోడ్డువెంట కూడా ఉన్నాయో సూచిస్తాయి. ఇప్పటికైనా మీరు గమనించండి, రహదారులను గుర్తించండి.

 

View this post on Instagram

 

A post shared by Kowshik Maridi (@kowshik_maridi)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular