Blinkit
Blinkit: బ్లింక్ ఇట్ కు అంతకంతకు ఆదరణ పెరుగుతున్న సేవలను మరింతగా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. డిసెంబర్ 31, జనవరి ఒకటి, ఫిబ్రవరి 14 తేదీలలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో బ్లింక్ ఇట్ విస్తృతంగా కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేసే రికార్డు సృష్టించింది. రోజాపూల నుంచి మొదలు పెడితే గ్రాసరీస్ వరకు అన్నింటిని డెలివరీ చేసి అదరగొట్టింది. బ్లింక్ ఇట్ అంబులెన్స్ రంగంలోకి కూడా వచ్చింది . ఇటీవల హర్యానాలో తన తొలిసారి సర్వీస్ మొదలుపెట్టింది.. అంబులెన్స్ వాహనంపై బ్లింక్ ఇట్ లోగో ఉండడంతో కొంతమంది నెటిజన్లు దీనిపై ప్రశ్నించడంతో.. ఆ తర్వాత బ్లింక్ ఇట్ తన లోగోను అంబులెన్స్ మీద నుంచి తొలగించింది. అయితే అంబులెన్స్ సేవలు మరింతగా విస్తరించడానికి బ్లింక్ ఇట్ ప్రయత్నాలు చేస్తోంది.. టైర్ -2 సిటీస్లో కూడా విస్తరించడానికి బ్లింక్ ఇట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే కొన్ని పట్టణాలలో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ఢిల్లీ నుంచి మొదలుపెడితే అహ్మదాబాద్ వరకు ప్రస్తుతం బ్లింకిట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.. త్వరలో ద్వితీయ శ్రేణి పట్టణాలలో కూడా బ్లింకిట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మోసం చేస్తోందా
సేవల్లో ఎంతో వేగాన్ని ప్రదర్శిస్తున్న బ్లింక్ ఇట్.. అదే తీరుగా మోసం చేస్తోందని కొంతమంది కస్టమర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ కస్టమర్ Reddit లో ఒక పోస్ట్ పెట్టాడు. అతడు పెట్టిన దాని ప్రకారం.. ఆ కస్టమర్ అరకిలో ద్రాక్ష పళ్ళను బ్లింక్ ఇట్ లో ఆర్డర్ చేశాడు. అయితే బ్లింక్ ఇట్ మాత్రం 370 గ్రాములు మాత్రమే డెలివరీ చేసిందని వాపోయాడు. బ్లింక్ ఇట్ డెలివరీ బాయ్ తీసుకొచ్చిన ద్రాక్ష పళ్లను చూసిన ఆ కస్టమర్ కు అనుమానం వచ్చింది. వెంటనే వాటిని తూకం వేసి చూసాడు. ఆది కేవలం 370 గ్రాములు మాత్రమే ఉన్నాయి. దీంతో అతడు తన ఆర్డర్ కాపీ, వచ్చిన ద్రాక్ష పండ్లను పక్క పక్కనపెట్టి ఫోటో తీసి.. Reddit లో పోస్ట్ చేశాడు..” నేను బ్లింక్ ఇట్ లో ద్రాక్ష పండ్లను ఆర్డర్ చేసాను. నేను ఆర్డర్ చేసిన పండ్లు కాకుండా.. నాసిరకమైనవి పంపించారు. తాజా పండ్లు, కూరగాయలు అని చెబుతూ.. నాసిరకమైనవి పంపిస్తున్నారు. ఇదేదో పెద్ద మోసం లాగా ఉంది. లాస్ట్ మినిట్ యాప్ అని చెబుతూ ఇలా యూజర్లను మోసం చేస్తున్నారని” ఆ కస్టమర్ వాపోయాడు. ఆ కస్టమర్ రెడ్ ఇట్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపై మిగతావారు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. తమకు కూడా అలాంటి అనుభవం ఎదురయిందని వాపోతున్నారు. ” మేం కూడా నాణ్యమైన వస్తువులు డెలివరీ చేస్తారని ఆర్డర్ పెట్టాం. కానీ నాకు ఇచ్చినవి వేరే విధంగా ఉన్నాయి. వాటిని చూసి మేము మోసపోయామని భావించాం. కాకపోతే మేము ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోయాం. మీరు చెప్పిన దానితో ఏకీభవిస్తున్నాం. ఇలాంటి అనుభవాలు మాకు కూడా ఎదురయ్యాయి. మేము ఆర్డర్ చేసిన వస్తువులు కాకుండా వేరే వాటిని డెలివరీ ఇచ్చారు. అవి కూడా నాసిరకంగా ఉన్నాయని” Reddit లో కస్టమర్లు వాపోయారు.
Also Read: తండ్రితో సంతోషాన్ని పంచుకున్న విరాట్ కోహ్లీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The blinkit job opening in bengaluru received over 13000 applications in a single day sparking debate
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com