Homeఎంటర్టైన్మెంట్Aamir Khan : 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్... ఆమెతో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించిన...

Aamir Khan : 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్… ఆమెతో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించిన అమిర్ ఖాన్! ఎవరీ గౌరీ స్ప్రాట్

Aamir Khan : సూపర్ స్టార్ అమిర్ ఖాన్ కి ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ఆయన చిత్ర పరిశ్రమలో ఉన్నారు. బాలీవుడ్ ని ఏలిన ఖాన్ త్రయం లో అమిర్ ఖాన్ ఒకరు. అమిర్ ఖాన్ నటించిన రంగీలా,లగాన్, ఫనా, 3 ఇడియట్స్, పీ 3, దంగల్ ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. దంగల్ మూవీ వర్ల వైడ్ రూ. 2000 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా రికార్డు అమిర్ ఖాన్ పేరిట ఉంది. రెండు వేల కోట్ల క్లబ్ లో మరొక చిత్రం లేదు.

Also Read : అమీర్ ఖాన్ రికార్డ్ ను కొట్టడం తెలుగు స్టార్ హీరోల వల్ల కావడం లేడా..?

అమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం పరిశీలిస్తే.. ఆయన 1986లో రీనా దత్తను వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్ ఖాన్ అనే కొడుకు, ఐరా పేరుతో కూతురు ఉన్నారు. కొన్నాళ్ల వైవాహిక జీవితం అనంతరం రీనాకు అమిర్ ఖాన్ విడాకులు ఇచ్చారు. అనంతరం కిరణ్ రావ్ ని 2005లో రెండో వివాహం చేసుకున్నాడు. కిరణ్ రావ్ తో అమిర్ ఖాన్ కి ఒక కొడుకు ఉన్నాడు. 2021లో ఆమెతో కూడా విడిపోతున్నట్లు అమిర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. కిరణ్ రావ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ అమిర్ ఖాన్ సన్నిహితంగానే ఉంటున్నారు. ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది.

మార్చి 14 అమిర్ ఖాన్ జన్మదినం. ఆయన 60వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా అమిర్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. గౌరీ స్ప్రాట్ అనే మహిళతో తాను రిలేషన్ లో ఉన్నానని తెలియజేశాడు. ఆరు పదుల వయసులో కొత్త పార్ట్నర్ ని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చాడు అమిర్ ఖాన్. ఒక్కరిగా గౌరీ పేరు మీడియాలో హైలెట్ అయ్యింది. ఎవరీ గౌరీ అని సెర్చ్ చేయడం ఆరంభించారు నెటిజెన్స్.

గౌరీతో 25 ఏళ్లుగా అమిర్ ఖాన్ కి పరిచయం ఉంది. ఇక గౌరీ బెంగుళూరుకు చెందిన మహిళ. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. భర్తతో విడిపోయారని సమాచారం. చాలా కాలంగా ఆమె అమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్లో పని చేస్తుంది. ఇండో-ఆంగ్లో మహిళ అయిన గౌరీ తండ్రి.. తమిళ్-బ్రిటిష్, తల్లి పంజాబీ-ఐరిస్. యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్ నుండి ఆమె డిగ్రీ పొందింది. వయసు పరంగా అమిర్-గౌరీ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం అమిర్ ఖాన్ సితారే జమీన్ ఫర్ మూవీ చేస్తున్నాడు. అలాగే రజినీకాంత్ కూలీ మూవీలో గెస్ట్ అప్పరెన్సు ఇస్తున్నాడు.

Also Read : ముచ్చటగా మూడో పెళ్ళికి సిద్ధమైన అమీర్ ఖాన్…అమ్మాయి ఎవరో తెలుసా..?

RELATED ARTICLES

Most Popular