Goa: గోవా.. దేశంలోనే అత్యధిక మంది పర్యాటకులు వచ్చే రాష్ట్రం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అయితే గోవాకు వచ్చే టూరిస్టులు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్‌ను అస్సలు పట్టించుకోవడం లేదు. రాష్ డ్రైవింగ్, రూల్స్ అతిక్రమించడం కారణంగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ టూరిస్టు.. ఖరీదైన తన కారు టాప్‌పై పిల్లలను పడుకోబెట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన కొంతమంది ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
ఇంత బాధ్యత రాహిత్యమా..
వాహనాలు డ్రైవ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించారు. ద్విచక్రవాహనదారుడి నుంచి పెద్ద పెద్ద వాహనాలు నడిపే వారి వరకు అందరూ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు, కానీ, ఆ నిబంధలను ఉల్లంఘించడమే యాక్సిడెంట్లకు కారనమవుతోంది. తాజాగా గోవాలో ఓ టూరిస్టు తన ఇద్దరు పిల్లలను ఖరీదైన కారు టాప్‌పై పడుకోబెట్టాడు. వాళ్లు నిద్రపోయారా.. లేక కావాలనే అలా పడుకోబెట్టాడా తెలియదు కానీ, వారు పైన ఉండగానే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా యజమాని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ దృశ్యం గోవాలో కనిపించింది. దీనిని చూసిన చాలా మంది సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. చిన్న పిల్లలను ఇలా కారుపై ఉంచి బాధ్యతారాహిత్యంగా కారు నడపడం చూసి ఆశర్యర్యపోయారు.
మండి పడుతున్న నెటిజన్లు..
కొంతమంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కారు యజమానిపై మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న వాడిని ఎందుకు వదిలేశారు.. అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి.. ఏమాత్రం అటూ ఇటు అయినా ప్రాణాలు పోతాయ్.. ఇదేంటిరా అయ్యా.. ఎక్కడా చూడలేదు.. అంటు కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ఇలాంటి వారిని వదిలేయకండి అని గోవా పోలీసులకు, తెలంగాణ డీజీపీకి కూడా ట్వీట్‌ను ఫార్వార్డ్ చేశారు.
Absolutely insane, I can’t believe this is coming from an educated and privileged person!
How can he engage in such irresponsible acts? @Goa_Cops @TelanganaDGP
— Divya Gandotra Tandon (@divya_gandotra) December 27, 2023