https://oktelugu.com/

Ambani Family: ముఖేష్ అంబానీ చిన్న కొడుకు జాతకంలో దోషం.. నివారణకు ఏం చేశారంటే..

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కు గతంలోనే పెళ్లి నిర్ణయింది.. ఇందులో భాగంగా అంబానీ కుటుంబం ముందస్తు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 3, 2024 9:29 am
    Ambani Family

    Ambani Family

    Follow us on

    Ambani Family: డబ్బున్న వాళ్లు జాతకాలను బాగా నమ్ముతారంటారు. అందుకే రకరకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. మీడియా కూడా డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరుగుతుంది కాబట్టి.. వాళ్లు ఏం చేసినా గొప్పగా ప్రచారం చేస్తుంది. పైగా అదేదో లోక కళ్యాణం కోసం చేస్తున్న క్రతువన్నట్టుగా డప్పు కొడుతుంది. ప్రస్తుతం భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమం కూడా పై తరహాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దానిని జాతీయ మీడియా నుంచి స్థానిక మీడియా వరకు ఊదరగొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.

    ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కు గతంలోనే పెళ్లి నిర్ణయింది.. ఇందులో భాగంగా అంబానీ కుటుంబం ముందస్తు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించింది. జూలై 12న వారిద్దరికీ పెళ్లి చేయబోతున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వివాహ క్రతువు జరగనుంది. మూడు రోజులపాటు ఈ వివాహ వేడుకలు జరుగుతాయి. జూలై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ పేరుతో వివాహ క్రతువును నిర్వహించనున్నారు . ఈయడాది మార్చి ఒకటి నుంచి మూడో తేదీ వరకు జాంనగర్ వేదికగా అనంత్ -రాధిక ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. ప్రపంచ స్థాయి అతిరథ మహారధులకు అద్భుతమైన ఆతిథ్యం అందించింది. అయితే మూడు రోజులపాటు జరిగే పెళ్లికి అంతకుమించి అనేలాగా ముఖేష్ అంబానీ కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ముఖేష్ అంబానీ ఆహ్వాన పత్రికలు పంపించారు. ఆహ్వాన పత్రికలు న భూతో న భవిష్యత్తు అన్నట్టుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వివాహ పత్రికలు తెగ సందడి చేస్తున్నాయి.

    అనంత్ పెళ్లి కంటే ముందు ముఖేష్ అంబానీ కుటుంబం ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. మంగళవారం పలువురు పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించింది. రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో ఈ వివాహ వేడుకలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్, కోడలు శ్లోక, అల్లుడు ఆనంద్, కుమార్తె ఈషా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జంటలకు ముఖేష్ అంబానీ భారీగా కానుకలు అందించారు. బంగారు మంగళసూత్రం, వధూవరులిద్దరికీ ఉంగరాలు, వెండి ముక్కుపుడక, మెట్టెలు, కాళ్లకు పట్టీలు అందించారు. పెళ్లి కుమార్తెకు స్త్రీ ధనం పేరుతో 1.1 లక్షల చెక్కు అందించారు. ఏడాదికి సరిపడా నిత్యావసరాలు, గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గిన్నెలు అందించారు. వచ్చిన అతిధులందరికీ వారు కోరుకున్న విధంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన దంపతులు ముఖేష్ – నీతా అంబానీ వద్ద ఆశీస్సులు అందుకున్నారు. అయితే ఈ కార్యక్రమం వెనుక వేరే ఉద్దేశం ఉందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ” అనంత్ జాతకంలో దోషం ఉంది. అందుకే పెళ్లిని ఇన్ని రోజులపాటు వాయిదా వేశారు. వేడుకల పేరుతో హడావిడి చేశారు. చివరికి పెళ్లికి ముందు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. దీనిని బట్టి చూస్తే ఏదో జరుగుతోంది. కాకపోతే ముకేశ్ అంబానీ కుటుంబం వేరే విధంగా డైవర్ట్ చేస్తోందని” సోషల్ మీడియాలో కామెంట్స్ వెళ్ళు వెత్తుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ పట్ల మరి కొంతమంది వేరే విధంగా రియాక్ట్ అవుతున్నారు. సమాజ హితం కోసం ముఖేష్ అంబానీ కార్యక్రమాలు చేపడుతుంటే అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని.. అలాంటివారిని పట్టించుకోవద్దని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కొడుకు పెళ్లి కంటే ముందు 50 మందికి వివాహాలు జరిపించి.. ముకేశ్ అంబానీ తనలో ఉన్న సేవా గుణాన్ని మరోసారి బయట ప్రపంచానికి చూపించారు.