Viral Marriage: పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒక్కసారి మాత్రమేజరుపుకునే ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం. చుట్టాలు, స్నేహితులందరినీ పిలుచుకొని ఆనందంగా గడుపుతాయం. అయితే నాటి నుంచి నేటి వరకు పెళ్లిళ్ల ప్రక్రియ మారుతోంది. ఒకప్పుడు వివాహ వేడుకను వారం రోజుల పాటు నిర్వహించారు. కానీ ఈరోజుల్లో ఒకటి, రెండు రోజుల్లో ముగించేస్తున్నారు. వివాహ తంతును నిడివిని తగ్గించిన కొత్త సంప్రాదాయాలు తీసుకొస్తున్నారు. ఈమధ్య పెళ్లిళ్లకు మందు వెడ్డింగ్ షూట్ ల హడావుడి బాగా అయింది. పెళ్లి కి ముందు వధువు, వరుడు కలిసి ఫొటోలు దిగడం పరిపాటి మారింది. ఇదంతా స్నేహితులు కలిసి తెచ్చిన సంప్రదాయం. ఇప్పుడు అదే స్నేహితులు కొత్త మరో సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అదేంటో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి కొడుకు ఓ అగ్రిమెంట్ పేపర్ పట్టుకొని మండపం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సాధారణంగా పెళ్లికొడుకు అడకత్తెర పట్టుకొని తిరుగుతాడు. మరి ఇదేంటి? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే ఆ తరువాత అసలు విషయం చెప్పారు. పెళ్లి మండపం ఎక్కే ముందు పెళ్లికొడుకుతో ఓ అగ్రిమెంట్ పేపర్ పై సంతకం తీసుకున్నారట. ఆ సంతకం చేస్తేనే మండపం ఎక్కడానికి అవకాశం ఇస్తామని అన్నారట. దీంతో అగ్రిమెంట్ ను చదివిన పెళ్లికొడుకు వెంటనే సంతకం చేసి ఆ ఆగ్రిమెంట్ పేపర్ తోనే హోమం చుట్టూ తిరిగాడు.
ఇంతకీ ఆ అగ్రిమెంట్ లో ఏముందంటే? వధువును ఎల్లప్పుడూ సురక్షితంగా చూసుకోవాలి. ఆమెతో ప్రేమగా మెదలాలి. ఎల్లప్పుడు ఆమెనే కరెక్ట్ అని భావించాలి. ఏడాదికి 3 సార్లు ఆమెను టూర్ కు తీసుకెళ్లాలి. ఆమె ఆనందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండాలి. ఆమె చలి పెడుతుందటే వెంటనే దుప్పటి అందించాలి. ఈ నిబంధనలు ఒప్పుకుంటేనే మా అమ్మాయిని మీకిస్తాం… అని అగ్రిమెంట్ లో ఉంది.
ఈ అగ్రిమెంట్ ను చూసి పెళ్లికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు. దీనిని పెద్ద ప్రేమ్ లా తయారు చేసి దానితో ఫొటోలు దిగారు. అయితే ఈ అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటారా? అని పెళ్లి కొడుకుకు చాలా మంది ప్రశ్నలు వేస్తుననారు. అలా ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రతి పెళ్లి కొడుకుకి ఇలాంటి అగ్రిమెంట్ పెట్టాలి.. అని కొందరు ఈ వీడియో కింద కామెంట్ పెడుతున్నారు. చాలా మంది ఈ వీడియోకు లైక్ కొడుతున్నారు.