https://oktelugu.com/

Pawan Kalyan Trivikram: హిట్టైతే అలా ప్లాప్ అయితే ఇలా… త్రివిక్రమ్ ని టార్గెట్ చేయడం న్యాయమేనా?

వంద కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన బ్రో 60 కోట్ల షేర్ వరకూ వసూలు చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ కాని చిత్రాలను రిఫర్ చేస్తూ దర్శకుడు త్రివిక్రమ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Written By: , Updated On : August 3, 2023 / 12:56 PM IST
Pawan Kalyan Trivikram

Pawan Kalyan Trivikram

Follow us on

Pawan Kalyan Trivikram: బ్రో మూవీ ఫలితంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత తక్కువ హైప్ తో బ్రో విడుదలైంది. థియేటర్స్ కౌంట్ కూడా చాలా తక్కువ. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ రీత్యా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. జులై 28న బ్రో మూవీ వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గత చిత్రాలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ కంటే తక్కువ నమోదయ్యాయి. వీకెండ్ వరకు వసూళ్లు పర్లేదు అన్నట్లుగా ఉన్నాయి. వీక్ డేస్ నుండి కలెక్షన్ పడిపోయాయి.

వంద కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన బ్రో 60 కోట్ల షేర్ వరకూ వసూలు చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ కాని చిత్రాలను రిఫర్ చేస్తూ దర్శకుడు త్రివిక్రమ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వినోదాయసితం రీమేక్ వద్దని ఫ్యాన్స్ మొదట్లోనే వ్యతిరేకించారు. ఇది ఆల్మోస్ట్ గోపాలా గోపాలా చిత్రాన్ని పోలి ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి చేసిన పాత్ర చేయడం సరికాదన్నారు.

బ్రో మూవీ ప్రమోషన్స్ లో త్రివిక్రమ్ చెప్పినందుకే పవన్ కళ్యాణ్ మూవీ చేశారని ఓపెన్ అయ్యారు. త్రివిక్రమ్ కి నేను రీమేక్ ఆలోచన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఒప్పించారని ఓపెన్ అయ్యారు. సముద్రఖని ఫ్లో లో చెప్పిన ఆ మాటలు త్రివిక్రమ్ ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. పవన్ కళ్యాణ్ రీమేక్స్ చేసేది ప్రోత్సహిస్తుంది త్రివిక్రమే అనే ఓ వాదన ఉంది. దాన్ని సముద్రఖని నిర్ధారించినట్లు అయ్యింది. బ్రో మూవీ చిత్రం పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందని ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ స్పేస్ లలో చర్చలు పెట్టి త్రివిక్రమ్ ని దూషించారు. పవన్ ఇమేజ్ కి సెట్ కానీ సినిమాలు త్రివిక్రమ్ చేయిస్తున్నాడని మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే బ్రో చిత్ర ఫలితానికి సోలోగా త్రివిక్రమ్ ని బాధ్యుడిని చేయడం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. త్రివిక్రమ్ చెప్పినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గుడ్డిగా చేయరు. ఆయన నిర్ణయం కూడా ఉంటుందని అంటున్నారు.

భీమ్లా నాయక్ భారీ విజయం సాధించగా ఆ రీమేక్ వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నారు. స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. భీమ్లా నాయక్ విజయం సాధించడంతో త్రివిక్రమ్ ని ఎవరూ ఏమీ అనలేదు. ఇప్పుడు బ్రో అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో త్రివిక్రమ్ టార్గెట్ అయ్యారు. విజయం వచ్చినప్పుడు పొగిడి, పరాజయం ఎదురైనప్పుడు తెగడడం సరికాదని అంటున్నారు.